Annapoorani OTT: రిలీజై నెల కాకముందే ఓటీటీలోకి రాబోతున్న నయనతార న్యూ మూవీ, ఎప్పుడు, ఎలా చూడాలంటే?
లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ అనేక లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నయన్ నటనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆమె అందాలకు కూడా చాలా మంది ఫిదా అయిపోతుంటారు. ఎప్పటికప్పుడు ఆమె చిత్రాలు రావాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అన్నపూరణి అనే సినిమా చేసింది. అయితే ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఎప్పుడు, ఎలా చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కథానాయిక ప్రాధాన్యమున్న అన్నపూరణి సినిమాకు... ది గాడెస్ ఆఫ్ పుడ్ అనేటి ట్యాగ్ లైన్ కూడా ఉంది. నీలేక్ష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయన్ తార హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కె.ఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్స్, నచ్చులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. జీ స్టూడియోస్, నాథ్ స్టూడియోస్ ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్ లు ప్రొడ్యూసర్ లుగా వ్యవహరించారు.

నయనతార హీరోయిన్ గా చేసిన 75వ సినిమా కావడం గమనార్హం. అందులోనూ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి మాంసాహార వంటలకు సంంధించిన రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుందనేది అమ్మపూరణి అసలు సినిమా కథ. అయితే ఈ సినిమా విడుదల అయి నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలో రాబోతుంది. ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ ఒకటో తేదీన విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ప్లిక్స్ లో డిసెంబర్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. నయన తార హీరోయిన్ గా చేసిన ఈ అద్భుతమైన సినిమాను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. థియేటర్లకు వెళ్లి చూడని వాళ్లు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్లు కూడా ఈ సినిమాను చూసేయండి.


Click it and Unblock the Notifications











