పాపం... సెక్సీగా ఉండే నయనతారకు చెవుడు?
హైదరాబాద్: తన హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులతో సౌత్ ఇండియాలో హాటెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామల్లో నయనతార ఒకరు. ఆమె అందం అదరహో అనని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మరి అలాంటి నయనతారను చెవుడు సమస్యతో చూడాల్సి వస్తే? అభిమానులు ఎలా ఫీలవుతారో?
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ మధ్య గ్లామర్ గా నటించడం తగ్గించిన నయనతార నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోంది. అందగత్తెగా తనకు వచ్చిన పేరు ఇక చాలు అనుకుందో ఏమో మంచి నటిని అనిపించుకోవాలని ఆరాట పడుతోంది. తాజాగా ఆమె తమిళ చిత్రం నానుమ్ రౌడీదాన్ అనే చిత్రంలో పోషిస్తున్న పాత్ర అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉంటుంది.

ఈ చిత్రంలో నయనతార చెవిటి అమ్మాయిగా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆమె నటన ఉంటుందని అంటున్నారు. ఆమె కెరీర్లో శ్రీరామ రాజ్యంలో చేసిన సీత పాత్ర మంచి పేరు తెచ్చినట్లే ఈ సినిమాలో ఆమె చేస్తున్న బదిర యువతి పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందని అంటున్నారు.
నయనతార ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ‘నాన్ బెండ', ‘నైట్ షో' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘ఐదు నమ్మ ఆలు', ‘మాస్', ‘తాని ఒరువన్', ‘నానుమ్ రౌడీ దాన్', ‘భాస్కర్ ది రాస్కెల్' చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











