ఎలా చెయ్యాలా అని వణికిపోయా..: నయనతార

By Srikanya

హైదరాబాద్: తొలి షాట్‌కి ఎలా చెయ్యాల్రా భగవంతుడా అని వణికిపోతుంటే రజనీకాంత్ ధైర్యం చెప్పారు. చంద్రముఖి సినిమా విజయవంతం అయ్యింది. విచిత్రం ఏంటో తెలుసా? చిన్నప్పట్నుంచీ ఆయనకి వీరాభిమానిని నేను. ఆయన నటించిన ఏ చిత్రాన్నీ వదిలిపెట్టకుండా చూసేదాన్ని. అలాంటిది ఆయన పక్కన నటనంటే బెదిరిపోయాను. చివరికి ఆయనిచ్చిన ధైర్యంతోనే అడుగులు వేశాను. ఆయన్నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకొన్నాను అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నయనతార. ఆమె చేసిన తొలి చిత్రం చంద్రముఖి. ఆ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అలాగే ...'మీరు ఇంతవరకు పెద్ద హీరోల పక్కన మాత్రమే చేశారు. అలాని ఏమన్నా రూల్‌ పెట్టుకున్నారా' అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నిజమే నాకన్నీ అటువంటి అవకాశాలే వచ్చాయి. అది నా అదృష్టం. దానికి పునాది చంద్రముఖి సినిమానేమో అనిపిస్తుంది. రజనీకాంత్‌ గారికి భేషజాలుండవు. ఆత్మీయంగా మసలుకొనే వ్యక్తి. ఆ విషయం షూటింగ్‌లో అడుగు పెట్టే వరకూ నాకు తెలియదుగా అంది.

'లక్ష్మీబావా.. లక్ష్మీబావా' అంటూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఆ అమ్మాయే 'వేరీజ్‌ ద పంచకట్టు.. వేరీజ్‌ ద నిలువు బొట్టు చారీ' అంటూ దూసుకుపోయింది. 'సింహా'లో అంత పెద్దరికం చూపించింది ఈ అమ్మడేనా అని అంతా ఆశ్చర్యపోయేంతలోపే... నారచీరలు ధరించి శోకమూర్తి సీత పాత్రని అంజలీదేవికి ఏమాత్రం తగ్గకుండా చేసి నందిని గెల్చుకున్న నయనతార తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం విడుదలకు సిద్దమైంది.

ప్రస్తుతం నయనతార నాగార్జున సరసన 'లవ్‌స్టోరీ', రానా సరసన 'కృష్ణంవందే జగద్గురుమ్‌' సినిమాల్లో నటిస్తోంది. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్‌.. సినిమా గురించి.. చెపుతూ...కథలో నాది చాలా కీలకమైన పాత్ర. హీరోయిన్ అంటే.. పాటలకే పరిమితం కాకూడదు. అంతో ఇంతో ప్రాముఖ్యం ఉంటేనే గుర్తింపు. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్‌ కూడా చెప్పుకొన్నా. నటిగా పరిపూర్ణమైన సంతృప్తి అందించిన సినిమా ఇది అందామె.

ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రం చేస్తోంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకుడు. పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కృష్ణం వందే జగద్గురుం చిత్రం విడుదలకు ముస్తాబవుతుండగా మాతృభాష మల యాళంలో ఒక చిత్రాన్ని ఒప్పుకుంది. తమిళంలో కార్తీ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న బిరియానీ చిత్రంలో నటించడానికి నయనతారను సంప్రదించగా కోటిం పావు పారితోషికం అడిగిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X