కర్తవ్యం మరోసారి టాలీవుడ్ తెరమీదకి, ఈ సారి నయనతారతో

Recommended Video

Nayanatara Is Playing Vijaya Shanthi's Role విజయ శాంతి పాత్రలో నయనతార ?

కర్తవ్యం ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది విజయ శాంతి, అప్పట్లో లేడీ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి చేసిన వైజయంతి పాత్రని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇంకో సారి కర్తవ్యం అనే సినిమా టాలీవుడ్ లో రాబోతోంది అయితే ఈసారి పోలీస్ ఆఫీసర్ కాదు కలెక్టర్గా, నటించేది కూడా విజయ శాంతి కాదు నయనతార....

నయనతార

నయనతార

నయన్ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో ‘శివలింగ', ‘విక్రమ్ వేదా' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ నిర్మాతగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకం పై తమిళం లో నిర్మించబడుతున్న ‘ఆరమ్' చిత్రాన్ని తెలుగు లో ‘కర్తవ్యం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార జిల్లా కలెక్టర్ గా కనిపించనుంది.

 కర్తవ్యం

కర్తవ్యం

రీసెంట్ గా ‘వాసుకి' సినిమాతో తనలోని డిఫెరెంట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసిన నయనతార ఇప్పుడు ‘కర్తవ్యం' సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో నయనతార డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కనిపించనుంది. అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

 పవర్ ఫుల్ క్యారెక్టర్

పవర్ ఫుల్ క్యారెక్టర్

గోపీ నైనర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని రవీంద్రన్ నిర్మించాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

 డిఫరెంట్ కాన్సెప్ట్

డిఫరెంట్ కాన్సెప్ట్

వరుస విజయాలతో, డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో దూసుకువెళుతున్న నయనతార ఈ చిత్రం లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ప్రేక్షుకులని అలరించడానికి సిద్దం అవుతోంది . ఎన్నో విజయవంత చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకొనడం తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

 నవంబర్‌ మొదటివారంలో విడుదల

నవంబర్‌ మొదటివారంలో విడుదల

ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమిళ వెర్షన్‌ ఈ నెలలో విడుదలవుతుందనీ, ‘కర్తవ్యం' చిత్రాన్ని నవంబర్‌ మొదటివారంలో విడుదల చేస్తామని నిర్మాత ఆర్‌. రవీంద్రన్‌ చెప్పారు. విఘ్నేష్‌, రమేశ్‌, సును లక్ష్మి, ఆనంద్‌ కృష్ణన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్‌, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్‌, కథ, దర్శకత్వం: గోపీ నైనర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X