»   » డోసు మరీ ఎక్కువైంది: నయనతార మూవీకి అడల్డ్ సర్టిఫికెట్

డోసు మరీ ఎక్కువైంది: నయనతార మూవీకి అడల్డ్ సర్టిఫికెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'డోర' మూవీకి సెన్సార్‌ బోర్డ్ A(అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. బోర్డ్ నుండి ఇలాంటి సర్టిఫికెట్ ఇష్యూ కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళనలో పడ్డారు.

సినిమాలో హర్రర్‌ కంటెంట్‌ డోసు మరీ ఎక్కువగా ఉన్నందువల్లే ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అయితే సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయని భావించిన దర్శక నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్‌ కోసం రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలనుకుంటున్నారు. యు/ఏ రావాలంటే సినిమాలోని కొన్ని సీన్లకు కత్తెర తప్పదు అని తెలుస్తోంది.

తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.
ఇప్పటి వరకు వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.

rn

భయ పెడుతున్న టీజర్


డోర తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

కథేంటి?

కథేంటి?

గతంలో ఆత్మ ఆవహించిన కారు కాన్సెప్టుతో తెలుగులో 'కారు దిద్దిన కాపురం' అనే సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. ఇప్పుడు అలాగే..దెయ్యం పట్టిన కారుని మనం చూడబోతున్నాం. అయితే ఆ కారు ఎవరిదీ అంటే...నయనతార ది. దెయ్యం పట్టిన కారుతో నయనతార పడే తిప్పలే డోర కథ అంటున్నారు.

నయనతార

నయనతార

సినీ పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న కొద్దీ విజయాలు అందుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది కేరళకుట్టి నయనతార. ఇటీవల హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మాయ'లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే తరహాలోని దెయ్యం కథతో రూపొందుతున్న 'డోరా'లో ఆమె నటిస్తోంది. దర్శకుడు సర్గుణం ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సహాయకుడు దాస్‌ రామస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అదే ముఖ్యం

అదే ముఖ్యం

హారర్ కాన్సెప్టు సినిమాలకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్య. వివేక్‌ మెర్విన్‌ ఈ బాధ్యతను తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా దినేష్‌కృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరు(మార్చి 31) లేదా ఏప్రిల్ మొదటి వారంలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

English summary
Nayanthara's Dora Censored as 'A' & Releasing on March 31st. A source says that the director even agreed to accept few cuts in the film, and tried justifying that the film deserved a ‘U’ or ‘U/A’ certification.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu