కార్తి ‘కాష్మోరా’..... రత్నమహాదేవిగా నయనతార, లుక్ అదిరింది

By Bojja Kumar

హైదరాబాద్: హీరో కార్తీ 'కాష్మరా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కార్తి డిఫరెంట్ లుక్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.

ఈ చిత్రంలో కార్తీ పాత్ర మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని....సైనికాధికారిగా, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

నయనతార

నయనతార

ఇందులో నయన్ రత్నమహాదేవి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో మనమెప్పుడూ చూడని నయనతారను చూడబోతున్నామని స్పష్టమవుతోంది.

పివిపి

పివిపి

పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ చిత్రం కాబోతోందని అంటున్నారు.

షూటింగ్

షూటింగ్

చెన్నైలో పూనమలై రోడ్ దగ్గర వేసిన భారీ సెట్ లో కాశ్మోరా సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కార్తీ, నయనతార, శ్రీ విద్య లపై తీసారు. విశేషమేంటంటే ఈ సినిమాకోసం పదహారు సెట్స్ వేశారట.

బాహుబలి రేంజిలో ఉంటుందా?

బాహుబలి రేంజిలో ఉంటుందా?

ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ని 'బాహబలి' సినిమాకి పనిచేసిన మకుట సంస్థ సమకూరుస్తున్నది. ఈ సినిమాకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X