»   » ‘మయూరి’గా భయపెట్టబోతున్న నయనతార

‘మయూరి’గా భయపెట్టబోతున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘మయూరి'. తమిళంలో ‘మాయ' పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. ఏక కాలంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తయారయ్యిందనీ, టెక్నికల్ గా ఉన్నతస్థాయిలో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని కళ్యాణ్ తెలిపారు.

ఇది ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో కనిపిస్తుంది. కథ ఆమె కేరక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె కెరర్లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో తప్పకుండా ఈ సినిమా ఉంటుంది. థ్రిల్లర్ కాబట్టి సహజంగానే ఇందులో మాటలకంటే దృశ్యానికే ఎక్కువ ప్రాధాన్యం. రీ రికార్డింగ్, విజువల్ ఎపెక్ట్స్ హైలెట్ అవుతాయి. వాటి కారణంగా ఈ సినిమాకు హాలీవుడ్ ఫిల్మ్ లుక్ వచ్చింది. రీ రికార్డింగ్ హంగేరీలో జరిపారు సంగీత దర్శకుడు రాన్ ఎథన్ యొహాన్. 24 ఏళ్ల ఓ కొత్త దర్శకుడితో నయనతార పని చేసిదంటే, ఈ సినిమా కథనం ఆమెను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది అన్నారు.

Nayanthara's 'Maaya' will released in Telugu as 'Mayuri'.

ఈ సినిమాకు సంబంధించిన శరవణన్ రూపొందించిన ఫైలట్ సీన్ చూసి, ఇంప్రెస్ అయి ఈ సినిమా చేసింది. ఇందులో మూడు పాటలుంటాయి. శ్రీమంతుడు సినిమా ఆడే థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నాం. ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు సి కళ్యాణ్.

రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎటాక్' సినిమాను సెప్టెంబరులో విడుదల చేస్తామని కళ్యాణ్ తెలిపారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘లోఫర్' షూటింగ్ ప్రస్తుతం జోధ్ పూర్ లో జరుగుతోందని, వాటి తర్వాత వి.వి. వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమా నిర్మిస్తాననీ ఆయన చెప్పారు.

ఆరి, అంజాద్ ఖాన్, మైమ్ గోపీ, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్, శరత్ తారాగణమైన ‘మయూరి' చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్, కూర్పు: టి.ఎస్: సురేష్, కళ: రామలింగం.

English summary
Nayanthara is playing a dual role in a Tamil movie titled 'Maaya'. It is a female centric horror entertainer. This film will be released in Telugu as 'Mayuri'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu