నయనతార కొత్త చిత్రం ఆడియో త్రివిక్రమ్ ఆవిష్కరణ

By Srikanya

నయనతార కన్నడంలో నటించిన ఓ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తూండగా దాని ఆడియోను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉపేంద్ర, నయనతార జంటగా రాక్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉపేంద్ర దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించి నిర్మాత సురేష్‌బాబుకు అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్రం దర్శకుడు,హీరో అయిన ఉపేంద్ర మాట్లాడుతూ ఈ చిత్రం చూశాక అందరూ ఒకేమాట అంటారు. కన్నడంలో ఈ చిత్రానికి సూపర్ అన్న పేరును ప్రేక్షకులే ఇచ్చారు. అలాగే తెలుగులో వావ్ అని అదిరింది అని, చాలా బాగుందని, ప్రపంచమంతా ఇందులోనే ఉందని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఎవరు ఎలా ఊహించుకున్నా అది కరక్టే. ఈ చిత్రం చూశాక అందరూ అదే మాటను అంటారు. సబ్జెక్టు డిమాండ్‌నుబట్టి చిత్రం వెరైటీ లుక్‌తో ఉంటుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X