ఇకపై నయనతార కాదు...అభినవ సీత!
'శ్రీరామరాజ్యం' సినిమాలో సీత పాత్రలో మనసు దోచే పెర్ఫార్మెన్స్ ఇచ్చి అభినవ సీతగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది హీరోయిన్ నయనతార. 'శ్రీరామరాజ్యం'లో బాపు తీర్చిన జానకిగా నయనతార పలికించిన కరుణరసం అందరి మన్ననలనూ పొందుతోంది. 'లవకుశ'లో అంజలీదేవిని సీతగా చూసిన వారు నయనను ఆ పాత్రలో ఊహించుకోవడానికే తొలుత ఇష్టపడలేదు. కానీ తెరపై ఆమెను చూశాక ప్రశంసించకుండా ఉండలేకపోయారన్నది నేటి వాస్తవం. సినిమాకు వెళ్లే వారిలో బాలయ్య అభిమానుల ఎక్కువగా ఉంటే అందులో సింహ భాగం నయనతార పెర్ఫార్మెన్స్ చూసేందుకే వెలుతున్నారంటే...అతిశయోక్తి కాదేమె. అంత అద్భుతంగా ఉంది నయనతార నటన.
మరి నయన తార ఇన్ని మార్కులు కొట్టేయడం వెనక చాలా కృషి ఉంది. 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులూ మహాసాధ్విగానే రోజువారి జీవనం సాగించింది. ప్రతిరోజూ ఉదయం గుడికెళ్ళిగానీ సెట్‌లో అడుగుపెట్టేది కాదు. శాకాహారమే తీసుకుంది. ఆమె కృషి ఫలితం తప్పకుండా స్క్రీన్‌పై కనిపిస్తుందిని అప్పుడే అంతా భావించారు. తాజాగా అదే నిజమైంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా కొంత అపఖ్యాతి మూడగట్టుకున్న సీత...ఈ సినిమా ద్వారా అవి ప్రేక్షకుల మదిలో నుంచి తొలగి పోయేలా చేసింది.
ఇకపై ఆమెను నయనతార అనే బదులు అభినవ సీత అని పిలిస్తే భాగుంటుందని అభప్రాయ పడుతున్నారు ఆమె అభిమానులు. మరి అంతలా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఆమె నట. ఏది ఏమైనా నయనతార నటనకు హాట్సాఫ్.


Click it and Unblock the Notifications











