వైట్ డ్రెస్‌లో మెరిసిపోయిన నయన తార: అందరి దృష్టీ ఆ పచ్చబొట్టుమీదే
వేలైక్కారన్ మూవీలో రీసెంట్ గా రిలీజ్ చేసిన నయన్ వైట్ డ్రెస్ లుక్ అదిరిపోయేలా ఉంది. అమ్మడి చేతిపై కనిపిస్తున్న టాటూ అసలు సిసలు పాయింట్.
Recommended Video

ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి వేలైక్కారన్ మూవీ చేస్తోంది నయనతార. కొన్ని వారాల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగా.. ఇప్పుడీ మూవీలోంచి నయన్ కు చెందిన ఓ సూపర్బ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. వైట్ డ్రెస్ లో నయనతార తెగ మెరిసిపోతోంది.

అదిరిపోయేలా వైట్ డ్రెస్ లుక్
ఈ వేలైక్కారన్ మూవీలో కూడా నయన్ కేరక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన వైట్ డ్రెస్ లుక్ అదిరిపోయేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కూడా అమ్మడి డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉండడంతో.. ఫోటోకు మరింతగా అందం వచ్చేసింది. 32 ఏళ్ల వయసులోనూ టీనేజ్ బ్యూటీలను సవాల్ చేసే అందాన్ని చూపించేస్తోంది నయన్.

PD అనే ఇంగ్లీష్ లెటర్స్
అయితే.. అమ్మడి చేతిపై కనిపిస్తున్న టాటూ అసలు సిసలు పాయింట్. PD అనే ఇంగ్లీష్ లెటర్స్ స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే అర్ధం డీటైల్డ్ గా చెప్పాల్సిన పని లేదు Prabhu Deva. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నపుడు. తమ ప్రేమకు జ్ఞాపకంగా తన చేతిపై ప్రభుదేవా పచ్చబొట్టు పొడిపించుకుంది. .. ఆ తర్వాత ప్రభుదేవాతో కటీఫ్ అయిపోయింది.

విఘ్నేష్ శివన్
ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది నయన్. అఫ్ కోర్స్.. పెళ్లి కూడా అయిపోయిందనే టాక్ ఉంది. అయినా సరే తన చేతిపై కనిపిస్తున్న ట్యాటూను మాత్రం ఇంకా అలాగే కొనసాగిస్తోంది నయనతార. ఇలాంటివాటిని పెద్దగా కేర్ చేసే టైపు కాదు నయన్.

కచ్చితంగా సినిమా సూపర్ హిట్
ఇప్పటికే వేలైక్కారన్ సినిమా ఫస్ట్, సెకండ్ లుక్ కు మంచి స్పందన రావడంతో కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 24AM స్టూడియోస్ నిర్మించిన వేలైక్కారన్ సినిమా మీద రోజురోజుకూ అంచనాలు పేరిగిపోతున్నాయి.

ఊహించని స్థాయిలో
తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా అలియాస్ రాజా వేలైక్కారన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రాజా ఊహించని స్థాయిలో సినిమాను తెరకెక్కించారని చిత్ర బృందం అంటోంది.


Click it and Unblock the Notifications











