అర్థరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తూ బుక్కైపోయిన నయనతార - పబ్లిక్ షాక్!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తూ గడుపుతోంది. ఖాళీ దొరికితే లేదా టైమ్ క్రియేట్ చేసుకుని మరీ తన పిల్లలు ఉయర్, ఉలగ్లతో మదర్ హుడ్ను ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె అర్థరాత్రి అలాంటి పని చేస్తూ పబ్లిక్ కంటిలో పడింది. అది చూసిన జనాలు షాకైపోయారు. ఇంతకీ నయన్ ఏం చేసిందంటే?
సౌత్ హాట్ బ్యూటీ నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. చాలా ఏళ్లుగా సినిమాల్లో తిరుగులేని నటిగా రాణిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. అలానే పర్సనల్ లైఫ్‌లోనూ పలు కాంట్రవర్సీలతో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటుంది. గతంలో ముఖ్యంగా లవ్ అఫైర్లతో మీడియాలో ఎక్కువగా నిలిచేది. అయితే కొంతకాలం క్రితం దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. ఇక ఆ ఫ్యామిలీ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తోంది..

అలా నయనతార తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నయన్‌తో పాటు మరో ఇద్దరు లేడీస్ కూడా కనిపించారు. వారు నయనతార ఫ్రెండ్స్ లేదా కజిన్స్ అని సమాచారం. వీళ్లంతా అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ఐస్ క్రీమ్ తింటూ లేట్ నైట్‌ను ఎంజాయ్ చేశారు. అలానే ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే నయనతార బ్యానర్ ఒకటి కూడా కనిపిస్తోంది. ముగ్గురు కలిసి ఫన్నీ ఫన్నీగా టైమ్ స్పెండ్ చేశారు. ఈ వీడియోను నయన్ భర్త విగ్నేష్ శివనే తీసినట్లు తెలుస్తోంది. ఇదంత చూసిన అక్కడక్కడా తిరిగే జనాలు కాస్త షాక్ అయ్యారు. అలానే ఆద్యంతం ఈ వీడియో ఫన్నీ ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు కూడా దాన్ని తెగ షేర్ చేస్తున్నారు.
ఇకపోతే నయనతార సినిమాల విషయానికి వస్తే గతేడాది జవాన్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత ఆమె ఓ సినిమా చేసినా అది బ్యాన్ అయింది. ప్రస్తుతం తమిళంలో మరో రెండు చిత్రాలకు సైన్ చేసింది. ఇంకా తెలుగులో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా ఓ కీలక పాత్ర పోషిస్టున్నట్లు సమాచారం అందింది. పార్వతిగా కనిపించనుందని అంటున్నారు.
అలా నయనతార ఓవైపు తన ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. అమ్మగా తన భాద్యతలను చక్కగా నిర్వర్తిస్తోంది. ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది.


Click it and Unblock the Notifications











