»   » రోడ్డుపై హీరోయిన్ వీరంగం, ట్రాఫిక్ జామ్ (ఫోటోస్)

రోడ్డుపై హీరోయిన్ వీరంగం, ట్రాఫిక్ జామ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరువనంతపురం: హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, అప్పట్లో ఓ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాక తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ఈడిగారు బొడ్డు సీన్ విషయంలో చేసిన రచ్చను నయనతార తప్పుబట్టగా... 'నాపై కామెంట్స్ చేయడానికి నయనతార ఎవరు? నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు ఆమె సలహాలు అవసరం లేదు. నయనతార ఎలాంటిదో(రియల్ లైఫ్‌లో) అందరికీ తెలుసు, నన్ను విమర్శించే అర్హత ఆమెకు లేదు' అంటూ నజ్రియా మండి పడింది. ఇది జరిగి చాలా కాలం అయంది. మళయాల నటుడైన ఫహాద్ ఫాజిల్‌ను పెళ్లాడినప్పటి నుండి నజ్రియా సినిమాలకు దూరంగా ఉంటోంది.

Nazriya Nazim Creates Problem Amidst Traffic?

సినిమాల్లో నటించని కారణంగా ఆమె గత కొంత కాలంగా వార్తల్లో లేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి నజ్రియా నజీమ్ వార్తలో వ్యక్తిగా మారింది. అందుకు కారణం ఆమె నడిరోడ్డుపై వీరంగం సృష్టించడమే. తన ఖరీదైన రేంజ్ రోవర్ కారును నడుపుకుంటూ వస్తున్న సమయంలో ఏదో వాహనం తగిలి కారు పేయింటు కాస్త గీసుకుపోయినట్లు అయింది. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడింది నజ్రియాం. ఓ రకంగా ఆమె వీరంగమే సృష్టించిందని చెప్పొచ్చు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నాయి.

English summary
Nazriya Nazim was snapped creating problem amidst traffic in Muvattupuzha few days back. Reportedly, it was a minor car mishap, and the actress was furious when she found out her Range Rover had a layer of paint missing.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu