నిజమే...: హాట్ హీరోయిన్ పెళ్లి వార్త
చెన్నై: 'రాజారాణి'తో యువకుల మన్ననలను సొంతం చేసుకున్న హీరోయిన్ నజ్రియ. కోలీవుడ్‌కు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇలా మంచి అవకాశాలు ఉన్న తరుణంలో పెళ్లి చేసేకునేందుకు చాలామంది వెనకాడుతారు. ఆ తరహా వార్తలు వచ్చినా ఒప్పుకోరు. కానీ ఈ మలబార్ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లికి సిద్ధమవుతోంది. ప్రముఖ మలయాళ యువనటుడు ఫహద్‌ను పెళ్లాడనుంది. ఈ మేరకు వారిద్దరికి ఎంగేజ్ మెంట్ అయినట్లు స్వయంగా ధృవీకరించారు.
దర్శకుడు పాజిల్ కుమారుడితను. 2013లో ఏకంగా 12 చిత్రాల్లో నటించేందుకు అంగీకారం చెప్పి.. సంచలనం సృష్టించాడు ఫహద్. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. రానున్న ఆగస్టులో వీరి వివాహాన్ని పెద్దలు నిశ్చయించినట్లు మలబార్ తీర సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు ఈ పెళ్లికి అంగీకారం చెప్పడంతో.. మూడుముళ్ల బంధంతో ఏకం కానుందీ జంట.
గతంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'నైయాండి' అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీమ్....సినిమాలోని బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీస్ కమీషనర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించారని హీరోయిన్ నజ్రియా నీజీమ్ తెగ హడావుడి చేసింది.


Click it and Unblock the Notifications












