»   » బొడ్డు సీన్ లొల్లి, దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు(ఫోటోలు)

బొడ్డు సీన్ లొల్లి, దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: హీరోయిన్ నజ్రియా నజీమ్, ధనుష్ తాజా తమిళ సినిమా 'నైయాండి' మూవీ మేకర్స్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించారని హీరోయిన్ నజ్రియా నీజమ్ ఆ చిత్ర దర్శక నిర్మాతలపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  తాజాగా ఆమె మంగళవారం(అక్టోబర్ 8) చెన్నై పోలీస్ కమీషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దర్శకుడు సర్‌కునమ్ తన కమ్యూనిటీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది. మరో వైపు దర్శకుడు ఆమె ఆరోపణలను ఖండించారు. ఆమె చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని మండి పడ్డారు.

  నజ్రియా తన ఫిర్యాదులో....'నేను కేరళలోని త్రివేంద్రంకు చెందిన ఎంతో మర్యాద పూర్వకమైన ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను. తమిళం, మళయాలం చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసారు. నేను ఫిర్యాదు చేయడానికి కారణం ఈ చిత్రంలో తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించడమే. నేను నటించని సీన్ వేరే వారితో చేయించి నేను చేసినట్లుగా చూపించారు' అని ఆమె తెలిపారు.

  'సినిమా షూటింగు సమయంలో ఆ సీన్ చేయడానికి నేను తిరస్కరించాను. నేనొక మర్యాద పూర్వకమైన ఫ్యామిలీ, కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కావడం వల్లనే తిరస్కరించాను. అప్పుడు దర్శకుడు, నిర్మాత అందుకు అంగీకరించారు. కానీ...సినిమా విడుదలయ్యాక చూస్తే నేను చేయని సీన్ కూడా నేను చేసినట్లు కనిపిస్తుంది' అని తెలిపారు.
  మిగతా వివరాలు స్లైడ్ షోలో....

  షాకైన నజ్రియా

  షాకైన నజ్రియా


  యూ ట్యూబులో ట్రైలర్ విడుదలైన తర్వాత నేను షాకయ్యాను. నేను చేయని సీన్ వేరొకరితో చేయించి నేను చేసినట్లుగా చూపించాను. నేను అప్పుడు చేయనని తిరస్కరించిన సీనే ఇపుడు ఇక్కడ కనిపిస్తోంది' అన్నారు.

  దర్శకడు ఆమెను వేధించాడా?

  దర్శకడు ఆమెను వేధించాడా?


  ‘నేను వెంటనే దర్శకుడు సర్‌కునమ్‌కు ఫోన్ చేసాను. ఎందుకిలా చేసారని అడిగాను. కానీ అతను అమర్యాదగా మాట్లాడారు. మా కమ్యూనిటీ గురించి అమర్యాదగా మాట్లాడారు. బెదిరించారు' అని నజ్రియా తెలిపింది.

  నజ్రియా కాల్ అవాయిడ్ చేసిన నిర్మాత

  నజ్రియా కాల్ అవాయిడ్ చేసిన నిర్మాత


  ‘నేను నిర్మాత కాథిరేన్‌కు కూడా ఫోన్ చేసాను. కానీ ఆయన నా కాల్‌కు సమాధానం చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నారు. నా అనుమతి లేకుండా నన్ను అసభ్యంగా చూపించడం బాలా బాధించింది' అని నజ్రయా పేర్కొంది.

  నజ్రియా అప్ సెట్

  నజ్రియా అప్ సెట్

  ట్రైలర్లో ఆ సీన్ ఉందని గమనించిన నజ్రియా...ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్న సినిమా నుంచి ఆ సీన్ తొలగించాలని, సినిమా తనకు చూపిన తర్వాతే విడుదల చేయాలని....నా అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆ సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

  ఆ సీన్ ఏంటి?

  ఆ సీన్ ఏంటి?


  నజ్రియా ఇంతలా అభ్యంతరం చెబుతున్న ఆసీన్ ఏమిటంటే....సినిమాలోని ఓ సన్నివేశంలో హీరో ధనుష్ హీరోయిన్ బొడ్డును టచ్ చేసే సీన్ ఉంటుంది. ఆసీన్ పైనే నజ్రియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

  బాడీ డబుల్ ట్రిక్

  బాడీ డబుల్ ట్రిక్


  హీరో తన చేయితో హీరోయిన్ బొడ్డును టచ్ చేసే సీన్ నజ్రియా చేయనని చెప్పడంతో......వేరే వారితో బొడ్డును టచ్ చేసే సీన్ తీసి నజ్రియా చేసినట్లుగా చూపించారు.

  నజ్రియా అనుమతి లేదు

  నజ్రియా అనుమతి లేదు


  తన అనుమతి లేకుండా తాను చేయని సన్నివేశాన్ని చేసినట్లుగా ఎలా చూపిస్తారని నజ్రియా ప్రశ్నిస్తోంది. ఇది సరైన చర్య కాదని ఆమె వాదిస్తోంది.

  దర్శకుడు ఏమంటున్నాడంటే...

  దర్శకుడు ఏమంటున్నాడంటే...


  చెన్నైలో ఒక రోజు షూటింగ్ కోసం నజ్రియాను పిలిచామని, కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేదు. బాడీ డబుల్ ఉపయోగించి షూటింగ్ చేయడానికి ఆమె ఒప్పుకున్నారు అని దర్శకుడు అంటున్నారు.

  నజ్రియాకు చాలెంజ్

  నజ్రియాకు చాలెంజ్


  దర్శకుడు హీరోయిన్ నజ్రియాకు చాలెంజ్ విసిరారు. మీడియా పర్సన్స్ ఆధ్వర్యంలో ఆ సాంగ్ చూసి అందులో ఏం తప్పుందో చెప్పాలని చాలెంజ్ చేసారు.

  నజ్రియాపై కేసు

  నజ్రియాపై కేసు


  నజ్రియా తమను అపకీర్తికి గురి చేసే ప్రయత్నం చేస్తోందని, ఆమెపై కేసు వేస్తామని దర్శకుడు వెల్లడించారు.

  English summary
  Nazriya Nazim and the makers of Naiyaandi's war over an intimate scene gets ugly with the actress making shocking accusations against them. On Tuesday (October 8), she met the Chennai Commissioner and filed a complaint claiming that the director Sarkunam vowed that he would bring disrespect to her community. On the other end, the director has denied allegations and said that the Mallu girl is doing all these to get cheap publicity.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more