బొడ్డు టచ్ రచ్చరచ్చ: హీరోయిన్‌పై బ్యాన్ నిజమేనా?
చెన్నై: ధనుష్ హీరోగా తెరకెక్కిన 'నైయాండి' అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీమ్....సినిమాలోని ఓ సీన్ విషయంలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీస్ కమీషనర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించారని హీరోయిన్ నజ్రియా నీజమ్ ఆ చిత్ర దర్శక నిర్మాతలపై శివాలెత్తిపోయింది.
సినిమా విడుదలకు ముందు ఆమె చేసిన రచ్చ కారణంగా....సినిమా వసూళ్లపై ఎఫెక్ట్ పడిందని టాక్. దీంతో తమిళ ఫిల్మ్ మేకర్స్ అంతా ఆమెపై అనధికారిక నిషేదం విధించారట. ఆమెను ఏ సినిమాలోనూ తీసుకోకూడదని నిర్ణయించినట్లు చెన్నై సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నజ్రియా ఇంత రచ్చ క్రియేట్ చేయడానికి కారణం ఓ హాట్ సీనే. సినిమాలో ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్ బొడ్డను టచ్ చేసే సీన్ ఉంటుంది. ఆమె అందుకు నో చెప్పడంతో...వారే వారితో ఆ సీన్ చేయించి ఆమె చేసినట్లుగా చూపించారట. దీంతో నా అనుమతి లేకుండా నన్ను అలా అసభ్యంగా చూపడం ఏమిటని గోల గోల చేసింది నజ్రియా. అయితే దర్శక నిర్మాతలు మాత్రం ఆమె పబ్లిసిటీ కోసమే అలా చేస్తుందని తేలిగ్గా తీసిపారేసారు.

ఆమెతో సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదా?
చిన్న విషయాన్ని పెద్దది చేసి సినిమాకు నష్టం కలిగించింది. అయినా అలాంటి సీన్లు చేయకుంటే ఆమెతో సినిమాలు చేయడం అనవసరం అంటూ తమిళ ఫిల్మ్ మేకర్స్ ఆమెతో సినిమా చేయడానికి అయిష్టతను ప్రదర్శిస్తున్నారట.

నజ్రియా పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు
నజ్రియా కాంట్రవర్సీ మూలంగా ఆమెపై దర్శక నిర్మాతల కోపంగా ఉన్నప్పటికీ....నైయాండి సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

. అవకాశాలు తగ్గాయి
నైయాండి సినిమా తర్వాత ఆమెకు పలు సినిమాల్లో అవకాశాలు దక్కాల్సి ఉన్నా.....ఆమె సృష్టించిన కాంట్రవర్సీ మూలంగా చాలా మంది వెనకడుగు వేసారట.

మళయాలం సినిమాలపైనే దృష్టి
తమిళ సినిమాల్లో అవకాశాలు తగ్గినా నాకేం బాధ లేదు...కానీ ఇష్టం లేని పనులు మాత్రం చేయను అనే రీతిగా ప్రవర్తిస్తోంది నజ్రియా. ప్రస్తుతం ఆమె తన సొంత ఇండస్ట్రీ అయిన మళయాలం చిత్రాలపైనే దృష్టి సారించింది.

నజ్రియా నెక్ట్స్ ప్రాజెక్ట్స్
నజ్రియా ప్రస్తుతం జై హీరోగా తెరకెక్కుతున్న ‘తిరుమనమ్ ఎన్నుమ్ నిఖక్కా' అనే తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అనీస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు.

నజ్రియా ఇతర తమిళ సినిమాలు
ప్రస్తుతం నజ్రియా జీవా హీరోగా తెరకెక్కుతున్న ‘నీ నల్ల వరువద' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

నజ్రియా మళయాల చిత్రాలు
‘సలాలా మొబైల్స్', ‘హై ఐ యామ్ టోనీ' అనే మళయాల చిత్రాల్లో నజ్రియా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











