జూ ఎన్టీఆర్‌తో 19 ఏళ్ల అమ్మాయి రొమాన్స్?

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలో 19 ఏళ్ల అమ్మాయితో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆయన తర్వాతి సినిమా 'రభస'లో మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆమె వయసు 19 సంవత్సరాలు మాత్రమే అని ఇండస్ట్రీ టాక్. ఇంతకు ముందు సెకండ్ హీరోయిన్ స్థానంలో కేథరిన్, నందిత పేర్లు వినిపించాయి. ఇప్పుడు నజ్రియా పేరు తెరపైకి వచ్చింది.

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా పలు చిత్రాల్లో నటించింది. ఆమె ఇప్పుడు మేజర్ కావడంతో హీరోయిన్ అవకాశాలూ వస్తున్నాయట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఖరారు కానప్పటికీ...'రభస' అనే పేరు ప్రచారంలో ఉంది.

ఇటీవల తొలి షెడ్యూల్‌లో కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిపారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X