NBK 109​ ఆ హీరోయిన్​కు బాలయ్య సర్​ప్రైజ్... సెట్స్​లో సెలబ్రేషన్స్​తో రచ్చ రచ్చ

నందమూరి నటసింహం ప్రస్తుతం ఫుల్ జోష్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే హ్యాట్రిక్​ హిట్స్​తో దూకుడు మీదున్న ఆయన ప్రస్తుతం NBK 109 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమా షూటంగ్​తో బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన మూవీటీమ్​ సెట్స్​లో హీరోయిన్​కు సర్​ప్రైజ్ ఇచ్చారు! దానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ బాలయ్య అండ్ టీమ్ ఇచ్చిన సర్​ప్రైజ్​ ఏంటి? ఏ హీరోయిన్​కు ఇచ్చారు? వంటి వివరాలను ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

ప్రస్తుతం టాలీవుడ్​ సీనియర్​ హీరోల్లో ఎక్కువ సక్సెస్​ రేట్​లో ఉన్న హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, కింగ్​ నాాగార్జున​, విక్టరీ వెంకటేశ్​తో పోలిస్తే ప్రస్తుతానికి ఆయనే హ్యాట్రిక్ హిట్స్​తో కెరీర్​లో పీక్ స్టేజ్​లో ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి అంటూ వరుస బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన NBK 109 వర్కింగ్ టైటిల్​తో ఓ సినిమా చేస్తున్నారు.

NBK 109 Update: Urvashi Rautela Grand Birthday Celabrations on the Sets of NBK 109

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్​ను జరుపుకుంటోంది. ఇప్పటికే బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్​ కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రం మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా మూవీటీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్​బీకే 109 టీమ్​ ఈ ముద్దుగుమ్మ బర్త్​ డే వేడుకలను గ్రాండ్​గా జరిపింది.

షూటింగ్​ స్పాట్​లో ఈ సెలబ్రేషన్స్​తో ఆమెకు సర్​ప్రైజ్ ఇచ్చింది. అందరూ కేక్ కట్​ చేసి తినిపించుకుంటూ సరదాగా గడిపారు. తన బర్త్​డేను గ్రాండ్​గా జరిపిన మూవీటీమ్​కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపారు. వీడియోలో దర్శకుడు బాబీ కూడా సందడి చేశారు. కేక్ తినమంటే సిగ్గుపడుతూ, కొంచెం కొంచెంగా కొరుక్కుతింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే వేడుకల్లో బాలయ్య పాల్గొనలేదు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో షూటింగ్స్​కు లాంగ్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు. దీంతో బాలయ్య లేని సీన్స్​ను బాబీ టీీమ్​ షూట్ చేస్తోంది. బాలకృష్ణ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉండేలా ప్లాన్ చేస్తూ షూటింగ్​తో ముందుకెళ్తోంది. కాగా, యాక్షన్ ఎంటర్టైనర్​గా రూపొందుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్​ను మూవీటీమ్​ త్వరలోనే రిలీజ్ చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X