బాలయ్య సినిమాలో మా ఆవిడ వద్దంది
నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీరామ రాజ్యం'. ఈచిత్రంలో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన 100 రోజుల వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన సతీమణి, దివంగత అన్నపూర్ణ జ్ఞాపకాలను గుర్తు చేసున్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామ రాజ్యం' సినిమాలో నేను వాల్మీకి పాత్ర చేస్తానంటే అన్నపూర్ణ తొలుత వద్దంది. అయితే రామాయణం మొత్తానికి వాల్మీకి హీరో కాబట్టి నేను ఎలాగైనా ఆ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. నేను, నాగార్జున కలిసి ఆమెను ఒప్పించాం అని చెప్పుకొచ్చారు.
తను పోషించిన రాముడి పాత్ర గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ పాత్ర చేస్తున్నప్పుడు నాన్న గారితో పోటీ పడ్డట్లు అనిపించింది. నాన్న గారికి ఎంతో పేరు తెచ్చి పెట్టిన రాముడి పాత్రను చేయడం నా అదృష్ణం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాపు, మురళీ మోహన్, నిర్మాత సాయిబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గతంలో శ్రీరామ రాజ్యం సినిమాకు సంబంధించిన అన్ని వేడుకలకు క్రమం తప్పకుండా హాజరైన నయన తార ఈ వేడుకలో మాత్రం కనిపించలేదు. ఈ చిత్రంలో నయనతార పోషించిన సీత పాత్రకు అందరి కంటే ఎక్కువ మార్కలు పడ్డ విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











