twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'మిత్రుడు'ఆన్ లైన్ లో ?

    By Staff
    |

    Balakrishna
    బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా భావించి చేస్తున్న మిత్రుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు గురువారం ఆన్ లైన్ (యు ట్యూబ్)లో దర్శన మిచ్చి చాలా మందని దిగ్భాంతికి గురిచేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏప్రియల్ నాలుగున ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సమయంలో ఇలా జరగటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నిర్మాత కృష్ణ ప్రసాద్ అయితే మీడియా ఎదుటే కన్నీటి పర్యంతమై ఆవేదన చెందారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇలా జరగటం ఏం చేయాలో అర్ధం కాని స్ధితిని కలిగిస్తోందన్నారు.

    ఇక ఎడిటింగ్ టేబుల్ మీదే ఇలాంటివి జరిగేందకు అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేసారు. ఎవరో కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా నెట్ లో లీక్ చేసారని అన్నారు. పోలీసులకు కూడా పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే మరో ట్విస్టు ఏమిటంటే ఈ విషయాన్ని ఓ ప్రెవేట్ ఛానెల్ వారు ప్రసారం చేస్తూ ఆ క్లిప్పింగ్స్ ని, పాటని డౌన్ లోడ్ చేసి మరీ చూపారు. ఎవరి బిజెనెస్ వారిది. కానీ ఇలా రిలీజ్ కు ముందే సినిమాలు రోడ్డు మీదకు తెస్తే..నిర్మాతల పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్ధకమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X