బాలయ్య అభిమానులకు శుభవార్త!

ఇక ఈ చిత్రం కోసం బాలయ్య చాలా కథలు వినటం జరిగింది. పాండురంగడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటంతో ఆయన కల్పిక కథలు,పౌరాణిక చిత్రాలు కన్నా వాస్తవిక చిత్రాలకే ప్రయారిటి ఇస్తాననటంతో ఈ కథని వినిపించటం జరిగింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ కథ ఆయనకు నచ్చటంతో మొదటి సారే ఓకే చేసేసారు. విజయేంద్ర ప్రసాద్ గతంలో బాలయ్యతో బొబ్బిలి సింహం చిత్రానికి కథలు రూపొందించారు. ఇక నిర్మాత కృష్ణ ప్రసాద్ గతంలో ఆదిత్యా 369,వంశానికొక్కడు, భలేవాడివి బాసు చిత్రాలు రూపొందించారు.
అలాగే ఈ చిత్రానికి మాటలు రత్నం,కాస్ట్యూమ్స్ డిజైన్స్ రమారాజమౌళి,సంగీతం మణిశర్మ,ఆర్ట్ ఆనంద సాయి,స్టంట్స్ రామ్-లక్ష్మన్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చంద్రమోహన్,బ్రహ్మానందం,ప్రదీప్ రావత్,తణికెళ్ళ భరణి,ఆహుతి ప్రసాద్,ధర్మవరరపు సుబ్రమణ్యం మిగతా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ప్రియమణి నందమూరి వంశం వారితో నటించటం ఇది మూడో సారి. గతంలో యన్టీఆర్ తో యమదొంగ,కళ్యాణ్ రామ్ తో హరేరామ్ చిత్రాల్లో ఆమె చేసింది.


Click it and Unblock the Notifications