జూన్ 3 బాలయ్య చిత్రం ఓపెనింగ్
ఇక ఈ చిత్రం జూన్ 3 న లాంచ్ కానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన చేసే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాతికి గతంలో ఎన్నో హిట్స్ బాలకృష్ణకు వచ్చి ఉండటంతో అప్పుడే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకుని చివరకు జయసింహ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. జయ సింహ లో సింహ ఉండటం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఈ నెలాఖరునుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లటానికి రెడీ అవుతన్నారు. ఇక మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే బ్యానర్ లో రిజిస్టర్ చేసి ఉండటంతో ఈ టైటిల్ తో ముందుకెళ్తున్నట్లు చెప్తున్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.


Click it and Unblock the Notifications












