బాలకృష్ణ సూపర్ హిట్ సంజయ్ దత్ తో ఖరారు

ఈ విషయమై దర్శకుడు దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ...నేను తొలిసారిగా హిందీలో డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. సంజయ్ దత్ నా ఫేవరెట్ హీరో. అతన్నే డైరక్ట్ చేయటం ఆనందం గా ఉంది. తమిళ,తెలుగులో సూపర్ హిట్టైన లక్ష్మీ నరసింహా చిత్రాన్ని నేను తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో అమితాబ్ ని ఓ కీలకపాత్రలోకి అడుగుతున్నాం. అయితే ఇంకా అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అవుతుందనుకుంటున్నాను. అతను కొలావరి డి పాట ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. అతనికీ ఇదే తొలి బాలీవుడ్ చిత్రం అవుతుంది. అయితే ఇంకా నిర్మాత,మిగతా సాంకేతికగణం వంటి వివరాలుకు కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే మేము వాటిని ఖరారు చేసుకునే పనిలో ఉన్నాను. ఈ ప్రాజెక్టుపై సంజయ్ దత్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన తమిళ ఒరిజనల్ చూసి ఇంప్రెస్ అయ్యారు అన్నారు.


Click it and Unblock the Notifications











