బాలకృష్ణ 'శ్రీ రామరాజ్యం' లాంచింగ్ డేట్..డిటేల్స్

By Srikanya

శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించే 'శ్రీరామరాజ్యం' చిత్రం షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నది. బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్ పూర్తయింది. ఇక ఈ చిత్రం లాంచింగ్ విశేషాలను నిర్మాత సాయిబాబు వివరిస్తూ "22న నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు 'శ్రీరామరాజ్యం' చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభిస్తాం.శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X