#NBK107 నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. బోసిడికే అంటూ బాలకృష్ణ సింహగర్జన

నందమూరి అభిమానులకు ఒక రోజు ముందుగానే పండుగ వాతావరణం తీసుకువచ్చాడు గోపీచంద్ మలినేని.. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులు అందరూ మంచి జోష్ లో ఉంటారు అన్న సంగతి తెలిసిందే. వారందరికీ ఒక రోజు ముందే ఆ జోష్ ఎక్కించే ప్రయత్నం చేశాడు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ 107వ సినిమా నుంచి ఫస్ట్ హంట్ టీజర్ పేరుతో ఒక నిమిషం రెండు సెకండ్ల నిడివిగల వీడియో విడుదల చేశారు. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ తో నందమూరి బాలకృష్ణ అలరించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అఖండ

అఖండ


బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించారు. అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ఒక నెగిటివ్ పాత్రలో నటించారు. పూర్ణ ఒక కీలక పాత్రలో నటించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తోనే నందమూరి బాలకృష్ణ తర్వాత సినిమా మొదలు పెట్టారు.

బాలకృష్ణ 107వ సినిమా

బాలకృష్ణ 107వ సినిమా


నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. నందమూరి బాలకృష్ణ 107వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత గోపీచంద్ మలినేని బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో పని చేస్తూ ఉండటంతోనే ఒకసారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు మరింత పెంచే విధంగా ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

టీజర్ ఆద్యంతం

టీజర్ ఆద్యంతం


తాజాగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే గోపీచంద్ మలినేని ఈ సినిమా నుంచి ఫస్ట్ హంట్ పేరుతో ఒక చిన్న వీడియో విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో నందమూరి బాలకృష్ణ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో అదిరిపోయే అవుట్ ఫిట్ లో కనిపించారు. ఒక ఊరి పెద్దగా ఆయన కనిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపిస్తున్న నందమూరి బాలకృష్ణ టీజర్ ఆద్యంతం కూడా ఆకట్టుకున్నారు.

ఒక రోజు ముందే

ఒక రోజు ముందే


నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ మా జీవో గాడ్స్ ఆర్డర్ అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో చెబుతున్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక భయం నా బయోడేటా లోనే లేదురా బోసిడికే, నడక మొదలు పెడితే ఏ పార్టీ ఏదో మీ పెళ్ళాలు కూడా తెలియదు నా కొడకల్లారా అంటూ మాస్ డైలాగ్స్ పెట్టడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు ఒక రోజు ముందే వచ్చేసింది అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
మాస్ ఇమేజ్ కి తగ్గ పాత్ర

మాస్ ఇమేజ్ కి తగ్గ పాత్ర


చాలాకాలానికి నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ కి తగ్గ పాత్ర పడినట్లు కనిపిస్తోందని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి మాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాని నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవి శంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X