జాంబియాలో బాలయ్య క్రేజ్.. నటసింహం బర్త్ డే సెలెబ్రేషన్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఆయన తొడ గొట్టి రికార్డులను బద్దలు కొడతాయి. కంటి చూపులతో రికార్డులను తిరగరాస్తాడు. వెండితెరపై బాలయ్య కనిపిస్తే అభిమానులకు పూనకాలే. అలాంటి బాలయ్య బర్త్ డే అంటే హంగామా ఉండకుండా ఉంటుందా? అందులో ముచ్చటగా షష్టి పూర్తి అంటే ఇంకే రేంజ్‌లో సెలెబ్రేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోండి.
బాలయ్య బాబు 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోషల్ మీడియాలో బాలయ్య బర్త్ డే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఇక యథావిథిగా బాలయ్య బాబు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో పిల్లల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. ఇక సాయంత్రం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే బాలయ్య బర్త్ డే వేడుకలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా జాంబియాలోని అభిమానులు నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జాంబియాలోని అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.


Click it and Unblock the Notifications











