సారా ఆలీఖాన్, శ్రద్దాకపూర్ ఇళ్లకు ఇంటికి ఎన్సీబీ .. కంగన రనౌత్ సెన్సేషనల్ ట్వీట్

బాలీవుడ్‌ను డ్రగ్ రాకెట్ కంబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమ పంజా విసురుతున్నారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలతో మసక బారుతున్న బాలీవుడ్‌ పరిశ్రమ ప్రతిష్టను పునరుద్దరించే పనిలో ఎన్సీబీ పడినట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా డొంకను కదిలించారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు దీపిక పదుకోన్, శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమన్ కంబట్టాకు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లకు సంబంధించిన పూర్తి సమాచారం.

అధికారులు స్వయంగా వెళ్లి సమన్లు

అధికారులు స్వయంగా వెళ్లి సమన్లు

నలుగురు బాలీవుడ్ అగ్ర తారలకు సమన్లు జారీ చేశారనే విషయం సినీ పరిశ్రమలను కుదిపేసింది. ఈ క్రమంలో ముంబైలోని సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్ నివాసాలకు ఎన్సీబీ అధికారులు స్వయంగా వెళ్లి సమన్లు అందించారు. సారా, శ్రద్దా కపూర్ సమన్లు జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. సారా, శ్రద్దా ఇద్దరు సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు హాజరు అవుతారు.

దీపిక పదుకోన్‌కు ఫోన్ ద్వారా సమాచారం

దీపిక పదుకోన్‌కు ఫోన్ ద్వారా సమాచారం

ఇక డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపిక పదుకోన్‌ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. దాంతో ఆమెను ఫోన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంప్రదించి సమన్లు జారీ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఎన్సీబీ అధికారుల సమన్ల విషయానికి దీపికా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీపికకు అధికారులు సమన్లు అందజేసిన విషయాన్ని ఆమె మేనేజర్‌ ధృవీకరించారు. సెప్టెంబర్ 25వ తేదీన దీపిక పదుకోన్ విచారణకు హాజరుకావాల్సి ఉంది

రకుల్ ప్రీత్‌కు ఫోన్ ద్వారా సమాచారం

రకుల్ ప్రీత్‌కు ఫోన్ ద్వారా సమాచారం

ఇక రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లను ముంబైలోని ఆమె నివాసానికి వెళ్లి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఆమెను ఫోన్‌లో సంప్రదించి ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయాన్ని వెల్లడించిన్నట్టు జాతీయ పత్రికలు కథనాన్ని వెల్లడించారు. రకుల్‌ను 24వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపినట్టు సమాచారం.

కంగన సెన్సేషనల్ ట్వీట్

కంగన సెన్సేషనల్ ట్వీట్

దీపిక పదుకోన్, శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేయడంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ స్పందించారు. సుశాంత్ హత్య చేయబడలేదు. కంగనకు అన్యాయం జరుగలేదని భావించే బాలీవుడ్ మాఫియా తొలిసారి వారి అకృత్యాలకు, శాడిజానికి, మౌనానికి చింతిస్తు ఉండి ఉంటారు. తొలిసారి వారు వాళ్లు చేసిన తప్పులను సరిదిద్దుకనే ప్రయత్నం చేసే పనిలో ఉంటారు అని కంగన ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X