‘నీ జతగా నేనుండాలి’ ప్లాటినమ్ డిస్క్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్ అయిన 'ఆషికీ-2' చిత్రాన్ని తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ లో సచిన్ జోషి, నజియా హుస్సేన్ హీరో హీరోయిన్లుగా నటించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శివబాబు బండ్ల సమర్పణలో కె.జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

జీత్ గంగూలీ, అంకిత్ తివారి, మిధున్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గణేష్, హీరో హీరోయిన్లు సచిన్ జోషి, నజియా హుస్సేన్ పాల్గొన్నారు. స్లైడ్ షోలో వేడుకకు సంబంధించిన ఫోటోలు....

బండ్ల గణేష్ మాట్లాడుతూ...

బండ్ల గణేష్ మాట్లాడుతూ...

అత్యంత తక్కువ బడ్జెట్ లో రూపొందిన హిందీ వెర్షన్ వంద కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగులో ‘నీ జతగా నేనుండాలి' మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

ఫీల్ గుడ్ మూవీ

ఫీల్ గుడ్ మూవీ


ఇది ఫీల్ గుడ్ మూవీ. పాటలు ఇంతగా ఆదరణ పొందుతాయని ఊహించలేదు. పెద్ద చిత్రాల ఆడియో సాధించినంత ఘనవిజయాన్ని ఈ పాటలు సొంతం చేసుకున్నాయి. సచిన్ చాలా బాగా నటించారు. ఈ సినిమా ప్రతి ఒక్కర్నీ కదిలిస్తుందని గణేష్ చెబుతున్నారు.

హీరో సచిన్ మాట్లాడుతూ..

హీరో సచిన్ మాట్లాడుతూ..


పాటలను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు శ్రోతలకు ధన్యవాదాలు. పాటల విజయం తాలూకు ఘనత ఎక్కువగా చంద్రబోస్ కు దక్కుతుంది. అద్భతుమైన సాహిత్యం అందించారని తెలిపారు.

విడుదల తేదీ

విడుదల తేదీ


తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X