Don't Miss!
- News కేసీఆర్‌కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'నీ ఊహల్లో నే ఉంటా'.. సరికొత్తగా యాక్షన్ లవ్‌స్టోరి
దర్శకత్వ శాఖలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన ప్రతిభాశాలి పురందర్ దాస్.కె స్వీయ దర్శకత్వంలో.. కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై.. మధులత నిర్మాణ సారధ్యంలో రూపొందించిన యాక్షన్ ఓరియంటెడ్ ప్రేమకథాచిత్రం 'నీ ఊహల్లో నే ఉంటా'. మనోజ్ కోడూరు, పర్లి భారతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో గోపాల్ పావగాడ, సంధ్య, శ్రావణి, ఆది మామిళ్ళ, హిందూనాథ్, మంజునాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నవ్య ప్రేమకథాచిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకనిర్మాత పురంధర్ దాస్.కె మాట్లాడుతూ.. 'తన మిత్రులకు జరిగిన అన్యాయాన్ని ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేసాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. యాక్షన్ తోపాటు వినోదానికి పెద్ద పీట వేస్తూ పగ నేపథ్యంలో రూపొందిన చక్కని ప్రేమ కథ 'నీ ఊహాల్లో నే ఉంటా'. దాదాపుగా అంతా కొత్త తారాగణంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
ఈ చిత్రానికి డాన్స్: వన్నూర్ కుమార్, ఛాయాగ్రహణం: ఎస్.కె.ఎం షరీఫ్, సంగీతం: రాజ్ కిరణ్, ఆర్.ఆర్: సి.ఎన్ ఆదిత్య, ఎడిటర్: ఎస్.జె.శివకిరణ్, నిర్మాణ సారధ్యం: మధులత, కథ-మాటలు-పాటలు-నిర్మాత-దర్శకత్వం: పురందర్ దాస్.కె!!