ఏంది రా ఈ గోల..... పాట రిలీజ్.. నీది నాదీ ఒకే కథ రిలీజ్‌కు సిద్ధం!
విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరో శ్రీవిష్ణు త్వరలో 'నీది నాది ఒకే కథ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లిరికల్ సాంగ్ రిలీజైంది. 'ఏంది రా ఈ జనాల గోల' అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా ఉందనే మాట వినిపిస్తున్నది.
విమర్శలకు కారణమైన ఆ లిరిక్స్
ఈ పాటలోని లిరిక్స్ శివ కాసర్త రాశారు. యూత్‌కు బాగా నచ్చేలా.... కాలేజీ కుర్రాళ్లు, యూత్ రెగ్యులర్‌గా మాట్లాడుకునే పదాలను వాడుతూ ఈ పాటను రూపొందించారు.

నీది నాది ఒకే కథ
‘నీది నాది ఒకే కథ' సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇండస్ట్రీలో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇప్పుడు నీది నాది ఒకే కథ ద్వారా దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు

అంచనాలు పెరిగాయి
శ్రీ విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఫ్యామిలీ యూత్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుంది.

మధ్యతరగతి యువకుడిగా శ్రీవిష్ణు
ఒక మధ్యతరగతి యువకుడిగా శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. ఆరన్ మీడియా వర్స్క్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హీరో నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాకు బొబ్బిలి సురేష్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం ఈ వారమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా థియేటర్ల బంద్ కారణంగా వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











