Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నీది నాది ఒకే టీజర్ రివ్యూ.. భావోద్వేగాల సంగమం
సాధారణంగా సినిమా టీజర్ రిలీజ్ అంటే చాలా హంగామా ఉంటుంది. కానీ అలాంటి హంగామా ఏమి లేకుండా ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రం టీజర్‌ను అత్యంత వినూత్నంగా రిలీజ్ చేశారు. ఓ మోటార్ బైక్ షెడ్డుకు వెళ్లి నజీర్ అనే మెకా
సాధారణంగా సినిమా టీజర్ రిలీజ్ అంటే చాలా హంగామా ఉంటుంది. కానీ అలాంటి హంగామా ఏమి లేకుండా 'నీది నాదీ ఒకే కథ' చిత్రం టీజర్‌ను అత్యంత వినూత్నంగా రిలీజ్ చేశారు. ఓ మోటార్ బైక్ షెడ్డుకు వెళ్లి నజీర్ అనే మెకానిక్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు.
అందరిలో ఒకడిగా
అందరిలో ఒకడిగా కలిసిపోయి.. అందరిలానే ఆలోచించే ఒక్కడి కథనే నీది నాదీ ఒకే కథగా తెరకెక్కించారు దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత నారా రోహిత్. ఈ చిత్రం టీజర్ శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు.
టీజర్లో శ్రీ విష్ణు సంఘర్షణ
చదువు ఒంటికే కాదు.. మెదడుకు కూడా పట్టని యువకుడిగా కనిపిస్తున్న పాత్రలో శ్రీవిష్ణు కనిపించాడు. టీజర్లో శ్రీ విష్ణు పడే సంఘర్షణ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నది.
సామాన్య కుటుంబంలో భావోద్వేగాలు
సామాన్య కుటుంబంలో చోటుచేసుకొనే భావోద్వేగాలు టీజర్ కనిపించాయి. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ కథ గురించి ఆలోచింపజేసే విధంగా టీజర్ ప్రభావం చూపించింది.
వేణు ఊడుగుల స్పందన
టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు వేణు ఊడుగుల తన స్పందనను ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ‘ఫిల్మ్ టీజర్ రిలీజ్ చెయ్యటానికి స్టార్ హీరోనో, స్టార్ డైరెక్టర్ నో ,స్టార్ ప్రొడ్యూసర్ నో అప్రోచ్ అవలేదు. నేరుగా ఒక సామాన్యుడి దగ్గరికి చేరాం. "నీలాంటి సగటు మనిషి కథ ఇది...నీ కథ నా కథ మన అందరి కథ ఒకటే " అని చెప్పి , అతని చేతుల మీదుగా రిలీజ్ చేపించాం.అరేంజ్డ్ మ్యారేజ్ లా కాకుండా , ఒక రిజిస్టర్ మ్యారేజ్ (ఆదర్శ వివాహం)లా సింపుల్ గా .... అతి సామాన్యంగా,అత్యంత ప్రేమ గా జరుపుకున్నాం. ఇదిగో మా సెలబ్రిటీ ఇతడే.. పేరు : నజీర్, వృత్తి: బైక్ మెకానిక్ అని ఓ సందేశాన్ని షేర్ చేశారు.