ఏప్రిల్‌లో తేజ ‘నీకు నాకు డాష్ డాష్’
చిత్రం, జయం తరహాలో అంతా కొత్త తారలతో తేజ రూపొందిస్తున్న చిత్రం 'నీకు నాకు డాష్ డాష్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రిన్స్, నందిత హీరో హీరోయిన్లగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తేజ వివరిస్తూ...'మధ్యం సిండికేట్ల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ప్రస్తుతం మద్యం సిండికేట్ల విషయంలో రాష్ట్రంలోనూ, అసెంబ్లీలోనూ విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మా చిత్రం రావడం యాదృచ్చికమే. హీరో హీరోయిన్లతో పాటు 42 మంది కొత్త వారిని పరిచయం చేస్తున్నాం. అంతా తెలుగువారే కావడం విశేషం. సంగీత దర్శకునిగా పరిచయమవుతున్న యశ్వంత్ నాగ్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది' అన్నారు.
నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ 'తేజ మార్క్ లవ్ స్టోరీ ఇది. ప్రేమ కథల్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తే కచ్చితంగా విజయం సాధిస్తాయనేది చరిత్ర చెప్పే సత్యం. మా భవ్య సిడీస్ ద్వారా విడుదలైన ఆడియోకు విశేషాదరణ లభిస్తోంది. పాటలు చాలా కొత్త ఉన్నాయని, క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటున్నాయని అందరూ చెబుతున్నారు. రసూల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. ఏప్రిల్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వి.కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.


Click it and Unblock the Notifications












