దర్శకుడు ‘తేజ’ కొత్త చిత్రం ఆడియో విశేషాలు
చిత్రం, జయం లాంటి విజయవంతమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ తాజాగా 'నీకు నాకు డాష్ డాష్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన సినిమాలు ఎక్కువగా కొత్త నటీనటులతోనే చేయడానికి ఆసక్తి చూపే ఈ దర్శకుడు....ఈ చిత్రం ద్వారా చాలా మంది కొత్తవారిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సోమవారం హైదరాబాద్‌లోని 'రేడియో మిర్చి' కేంద్రంలో నేరుగా ఎఫ్ఎం ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా యశ్వంత్ నాగ్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో దర్శకుడు తేజ లిక్కర్ సిండికేట్లను, మోస పూరిత వ్యాపారాలను ఫోకస్ చేశాడు. దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే సినిమా నుంచి సదరు సీన్లను కత్తిరించాలని ఆ సినిమా యూనిట్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో లిక్కర్ సిండికేట్లపై అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తేజ సినిమాకు లిక్కర్ సిండికేట్ల ప్రస్తావన ఉండటం చర్చనీయాంశం అయింది.
వివాదాలతో తన సినిమాకు ప్రచారం కల్పించుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తాను కథ, కథానాన్ని నమ్ముకుని సినిమా రూపొందించానని, రాష్టంలో లిక్కర్ సిండికేట్ల గొడవ మొదలు కాక ముందు 10 నెలల క్రితమే తాను కథను తయారు చేశానని, కాకతాళీయంగా తమ సినిమా విడుదల సమయానికే రాష్ట్రంలో ఈ గొడవ తెరపైకి వచ్చిందన్నారు.


Click it and Unblock the Notifications












