తేజ ‘డాష్..డాష్’ సినిమా వాయిదా
దర్శకుడు తేజ ఈ చిత్రం గురించి ఇటీవల ప్రెస్ మీట్లో వివరిస్తూ...'మధ్యం సిండికేట్ల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ప్రస్తుతం మద్యం సిండికేట్ల విషయంలో రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మా చిత్రం రావడం యాదృచ్చికమే. హీరో హీరోయిన్లతో పాటు 42 మంది కొత్త వారిని పరిచయం చేస్తున్నాం. అంతా తెలుగువారే కావడం విశేషం. సంగీత దర్శకునిగా పరిచయమవుతున్న యశ్వంత్ నాగ్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది' అన్నారు.
నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ 'తేజ మార్క్ లవ్ స్టోరీ ఇది. ప్రేమ కథల్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తే కచ్చితంగా విజయం సాధిస్తాయనేది చరిత్ర చెప్పే సత్యం. మా భవ్య సిడీస్ ద్వారా విడుదలైన ఆడియోకు విశేషాదరణ లభిస్తోంది. పాటలు చాలా కొత్త ఉన్నాయని, క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటున్నాయని అందరూ చెబుతున్నారు. రసూల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది' అని తెలిపారు.
పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వి.కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.


Click it and Unblock the Notifications












