తేజ డాష్ డాష్... సినిమా నిలిపివేత, రీషూట్
దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీ నాకు డాష్ డాష్' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించకుండా డీలా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు తేజ ఈచిత్ర ప్రదర్శన నిలిపి వేయాల్సిందిగా అన్ని థియేటర్లకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రీ షూట్ చేసి తిరిగి మళ్లీ రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
క్లైమాక్స్ ఎపిసోడ్‌లో మార్పులు చేయడంతో పాటు, సినిమాలో మరిన్ని కామెడీ సీన్లు మిక్స్ చేసి...ఎంటర్ టైన్మెంట్ మసాలా దట్టించనున్నారు. సినిమా టైటిల్ కూడా పెద్దగా ప్లస్ కాక పోవడంతో దాన్ని కూడా మార్చాలని చూస్తున్నట్లు సమాచారం. మే 4వ తేదీన ఈ చిత్రం తిరిగి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటీవల మిస్టర్ నూకయ్య చిత్రం కూడా విడుదలైన తర్వాత కొంత నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో....కొన్ని మార్పులు, చేర్పులు చేసి మళ్లీ విడుదల చేశారు. తాజాగా తేజా కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతుండటం గమనార్హం. మున్ముందు ఇంకా ఎన్ని సినిమాలు ఈ దారిలో ప్రయాణిస్తాయో?
అంతా కొత్త తారలతో వి.ఆనందప్రసాద్ నిర్మాణతలో తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' ఏప్రిల్ 13న విడుదలైంది. ఈ చిత్రం కథ ప్రకారం మద్యం సిండికేట్‌లో పనిచేసే హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. హీరోయిన్‌కు కడుపు అవుతుంది. దానివల్ల సమస్యలో చిక్కుకొని, దాన్నుంచి బయటపడ్డం కోసం మరో తప్పు చేస్తారు. ఆ తర్వాత బలవంతంగా ఇంకో పెద్ద తప్పు చేస్తారు. దాంతో మద్యం సిండికేట్ మొత్తం వాళ్ల వెంట పడుతుంది. ప్రిన్స్, నందిత, తీర్థ, ధర్మవరపు, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించారు. మాటలు: రామస్వామి, సంగీతం: యశ్వంత్ నాగ్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం: తేజ.


Click it and Unblock the Notifications











