డాష్ సినిమాకు టైటిల్ సైతం మార్చిన తేజ
తేజ తాజా చిత్రం నీకు నాకు డాష్ డాష్ ..భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమాని నిలబెట్టుకునే క్రమంలో ఈ చిత్రంకి మొదట ట్రిమ్మింగ్ చేసి రెండు రోజులు క్రితం వదిలారు. అయినా రెస్పాన్స్ లేకపోవటంతో ఇప్పుడు టైటిల్ సైతం తేజ మార్చటానికి రెడీ అయ్యారు. అలాగే సినిమా లో ధర్మవరపు కామిడీ ట్రాక్ సైతం సెకండాఫ్ లో కలుపుతాను అంటున్నారు. క్లైమాక్స్ ని రీషూట్ చేస్తాను అని చెప్పారు.
ఈ విషయమై తేజ మీడియాతో మాట్లాడుతూ...మా సినిమాకు టైటిల్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటున్నారని అర్దమైంది. నిజానికి సినిమా చాలా క్లీన్ ఫ్యామీలీ ఎంటర్టైనర్ . దాంతో మేము ,సినిమాతు నీకు నాకు అనే టైటిల్ ని పెడుతున్నాం. ఈ సినిమా ఓ టచ్చింగ్ లవ్ స్టోరి. కల్తీ మధ్యం తయారు చేసే లిక్కర్ సిండికేట్ నేపధ్యంలో చిత్రం నడుస్తుంది. మీరు ఈ సినిమా చూస్తే ఇది క్లీన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతుంది అన్నారు. అలాగే ..ధర్మవరుపు సుబ్రమణ్యం పేరు మా సినిమా క్రెడిట్స్ రోల్స్ లో కపడుతుంది. అయితే సినిమాలో ఆయన లేరు. ఎడిటింగ్ లో ఆయన మీద చేసిన ఎమోజింగ్ కామిడీ తీసేసాం. ఇప్పుడు వాటిని రెండు వారాలు లోపు కలిపి రిలీజ్ చేస్తాం అన్నారు.
కేక డిజాస్టర్ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని మరీ తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' మొదటి రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఈ చిత్రం తప్పకుండా ఓ మంచి ఫీల్ గుడ్ చిత్రం అవుతుందని తేజ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ సెకండాఫ్ బాగా ఇబ్బంది పెట్టడంతో జనం అసహం ఫీలయ్యారు. దాంతో ఇప్పుడు ఇప్పడీ మార్పులతో జనాల్ని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని పూర్తి స్ధాయిలో ఆకర్షిస్తుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
భవ్య క్రియేషన్స్ పతాకంపై తేజ తెరకెక్కించిన చిత్రమిది. ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. హీరోగా చేసిన ప్రిన్స్ మాట్లాడుతూ "తేజగారితో పనిచేసి చాలా నేర్చుకున్నా. తెరపై సినిమాను చూసినప్పుడు ఎక్కడా తృప్తిగా అనిపించలేదు. క్లేరిటీ గురించిన ఆలోచనలు చుట్టిముట్టాయి. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ చాలా ఇష్టం. పలు సన్నివేశాల్లో నటించడానికి ఆ అనుభవం పనికొచ్చింది'' అని అన్నారు. "తేజగారి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. సెట్‌లో ఏ సీన్ తీస్తుంటే అందుకు తగ్గట్టు మూడ్‌ను క్రియేట్ చేస్తారు తేజగారు. ఎక్కడి విషయాలను అక్కడే వదిలేయాలని తేజగారు నేర్పించారు'' అని నందిత చెప్పారు. సంగీత దర్శకుడు యశ్వంత్‌నాగ్ చెబుతూ "తొలి చిత్రం తేజ తెరకెక్కించిన 'నీకు నాకు డాష్ డాష్' కావడం అమితానందంగా ఉంది'' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నేరవి కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











