షో,మిస్సమ్మ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల మదిలో ఓ ముద్ర వేసిన దర్శకుడు నీలకంఠ. ఆయన గత కొంత కాలంగా భాక్సాఫీసుని మెప్పించలేకపోతున్నారనే సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆయన ఓ కమర్షియల్ సినిమాతో ఈ సారి ముందుకు రావటానకి ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఆయనో మాస్ సినిమా స్క్రిప్టు తీసుకుని ఓ పెద్దహీరోని సంప్రదించినట్లు,అది కూడా భారీ బడ్జెట్టుతో ఉందని సమాచారం. విన్న ఆ హోరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇంతకుముందు కూడా ఐతే వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన యువ దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ కమర్షియల్ బాట పట్టడానికి గోపీచంద్ తో ఒక్కడున్నాడు చిత్రాన్ని తీసారు. అయితే గోపీచంద్ మాస్ ఇమేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయారని ఫెయిల్యూర్ చెప్పకనే చెప్పింది. అలాంటి పరిస్ధితి నీలకంఠకు రాకూడదని ఆశిద్దాం.