జూన్2న నందనవనం 120 కి.మీ
వర్మ, మానస హీరో హీరోయిన్లుగా దర్శకుడు నీలకంఠ నిర్మిస్తున్న నందనవనం 120 కి.మీ. సినిమా జూన్ 2న విడుదల కానుంది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. గతంలో దర్శకుడిగా జాతీయ అవార్డును పొందిన నీలకంఠ తాజా సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొత్త హీరో హీరోయిన్లతో మేం తీస్తున్న ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుందనే నమ్మకం ఉంది. ప్రసుత్తం వస్తున్న చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో పాటలే ఉండవు. అయితే నేపథ్య సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంది. దీనిని విజయ్ అందించారు. ఇటీవలే రీ-రికార్డింగ్ పూర్తయింది. సినిమాను జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు.
ఇందులోని ప్రతి పాత్రకూ ఓ ఐడెంటిటీ ఉంటుందని, నటీనటులంతా పాత్రోచితంగా నటించారని, అలానే టెక్నీషియన్లకు ఈ సినిమా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని నీలకంఠ తెలిపారు. కోట శ్రీనివాసరావు, తాళ్ళూరి రామేశ్వరి, నరేశ్, సురేఖావాణి,గౌతంరాజు, కమల్, ఉమ ఇతర పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: విజయ్.


Click it and Unblock the Notifications