క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ప్రెగ్నెన్సీ.. పెళ్లి చేసుకొని నీ బిడ్డకు తండ్రినవుతా.. ప్రముఖ డైరెక్టర్ గురించి న
ప్రముఖ సినీ నటి నీనా గుప్తా ఆత్మకథ 'సచ్ కహో' తో ఆటోబయోగ్రఫి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల కరీనాకపూర్ చేతుల మీదుగా రిలీజైన నీనా గుప్తా ఆత్మకథ ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. తన ఆత్మకథలో నీనా గుప్తా వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నీనా గుప్తా వెల్లడించిన విషయాలు ఏమిటంటే...

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ ఉమెన్‌గా
బాలీవుడ్ సినీ పరిశ్రమలోనూ, టెలివిజన్ ఇండస్ట్రీలోనూ నీనా గుప్తాకు బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ ఉమెన్‌గా పేరున్నది. కెరీర్ ఆరంభంలో చోటుచేసుకొన్న పలు అఫైర్లు, డేటింగ్స్, బ్రేకప్స్ కారణంగా మీడియాలో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌ను ఆకర్షించే వారు. అత్యంత సుదీర్గంగా సాగిన కెరీర్‌లో జరిగిన సంఘటనలను సచ్ కహో ద్వారా పంచుకొన్నారు.

వీవీయన్ రిచర్డ్స్‌తో గర్భం
ప్రముఖ క్రికెటర్, లెజెండ్ వీవీయన్ రిచర్డ్స్‌తో ప్రేమాయణం సాగించిన తర్వాత అతడి ద్వారా నీనా గుప్తా గర్బం దాల్చడం సంచలనంగా మారింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడమనే విషయం ఆ సమయంలో చర్చనీయాంశమైంది. అలాంటి పరిస్థితుల్లో తాను మానసిక సంఘర్షణకు గురయ్యాను అని తన ఆత్మకథలో చెప్పారు.

కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరంటూ
క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్ ద్వారా పెగ్నెంట్ అయిన తర్వాత బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ పెళ్లి చేసుకొంటానని ముందుకు వచ్చారు. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న రాకుండా ఉండేందుకు నిన్ను పెళ్లి చేసుకొంటాను. నీ బిడ్డకు నేను తండ్రిగా బాధ్యత వహిస్తానని చెప్పారు. అయితే దర్శకుడు సతీష్ కౌశిక్ ప్రతిపాదనను నిరాకరించాను అని నీనా గుప్తా తెలిపారు.

మసాబాకు సింగిల్ పేరేంట్‌గా
ఇదిలా ఉండగా, పెళ్లి కాకుండానే బిడ్డకు నీనాగుప్తా జన్మనిచ్చారు. రిచర్డ్స్ ద్వారా పుట్టిన కూతురికి మసాబా గుప్తా అని పేరు పెట్టారు. రిచర్డ్స్‌తో బ్రేకప్ తర్వాత సింగిల్ పేరెంట్‌గా మసాబాను పెంచారు. 2008లో ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రా అనే చార్టెడ్ అకౌంటెంట్‌ను వివాహం చేసుకొన్నారు.
Recommended Video

నీనా గుప్తా సినీ కెరీర్ ఇలా..
నీనా గుప్తా కెరీర్ విషయానికి వస్తే.. సాత్ సాత్ అనే సినిమాతో 1982లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గాంధీ, ఉత్సవ్, సూరజ్ కా సత్వా ఘోడా, ఖల్ నాయక్, వీర్ దే వెడ్డింగ్, పంగా, బాదాయి హో, ముల్క్, సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన 83, డయల్ 100, గ్వాలియర్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఇటీవల మేడ్ ఇన్ హెవెన్, పంచాయత్, మసాబా మసాబా, పరివార్ వెబ్ సిరీస్‌లో నటించారు.


Click it and Unblock the Notifications











