పెళ్లి చేసుకొంటానని చివరి క్షణంలో మోసం.. ఆత్మకథలో సంచలన విషయాలు బయటపెట్టిన నీనా గుప్తా

బాలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే పేరున్న నీనా గుప్తా తన ఆత్మకథను పుస్తక రూపంలో పబ్లిక్‌ ముందుకు తీసుకొచ్చారు. ఎన్నో సంచలన సంఘటనలు, జీవితంలో చోటుచేసుకొన్న భావోద్వేగమైన సన్నివేశాలను సచ్ కహా తో అనే పుస్తకంలో నీనా గుప్తా క్రోడికరించారు. ఈ పుస్తకాన్ని సోమవారం అంటే జూన్ 14వ తేదీన బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆవిష్కరించారు.

వర్చువల్ మీటింగ్ ద్వారా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కరీనాకపూర్‌తో నీనా గుప్తా మాట్లాడుతూ.. తన జీవితానికి సంబంధించిన గత రిలేషన్స్‌షిప్స్, బ్రేకప్ గురించి బోల్డుగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన జీవితంలో చోటుచేసుకొన్న ప్రేమకథను ఆమె వివరించారు.

NSD నుంచి ముంబైకి జర్నీ

NSD నుంచి ముంబైకి జర్నీ

నీనా గుప్తా ఆత్మకథలో 'సచ్ కహా తో'లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రోజలు నుంచి ముంబైలో అడుగుపెట్టిన వరకు, అలాగే జీవితంలోని బ్రేకప్స్, ఓ బిడ్డకు తల్లిగా ఇతర అంశాలతో కలిసి చేసిన ప్రయాణాన్ని పొందుపరిచారు. ఇండస్ట్రీలో పాలిటిక్స్, క్యాస్టింగ్ కౌచ్ లాంటి సంచలన విషయాలు పుస్తకంలో రాసినట్టు ఆమె తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందనే విషయాలను కూడా అందులో చేర్చినట్టు తెలిపారు.

పెళ్లి విషయంలో అలాంటి మోసం..

పెళ్లి విషయంలో అలాంటి మోసం..

నా కెరీర్ ఆరంభంలో నాకు ఓ వ్యక్తితో అఫైర్ నడిచింది. చివరి క్షణాల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. ఆ వ్యక్తి తల్లిదండ్రులంటే నాకు విపరీతమైన గౌరవం. వారి ఇంటిలోనే ఉండేదానిని. నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకొని సంతోషంగా భార్య, పిల్లలతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఆయన తప్పకుండా చదవడానికి అవకాశం ఉంది అంటూ నీనా గుప్తా వెల్లడించారు.

వివియన్ రిచర్డ్స్‌తో అఫైర్

వివియన్ రిచర్డ్స్‌తో అఫైర్

వెస్టిండీస్ క్రికెటర్, కెప్టెన్ వివియన్ రిచర్డ్స్‌తో లవ్ అఫైర్, అతడి ద్వారా కలిగిన సంతానం మసాబా గుప్తా గురించిన విషయాలను సచ్ కహా తో పుస్తకంలో ప్రస్తావించారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని అఫైర్లతో కాలం గడిచింది. ఆ రిలేషన్స్ ఏవీ కూడా వర్కవుట్ కాలేదు అని నీనా గుప్తా చెప్పారు. నా తల్లిదండ్రులు బతికి ఉంటే నేను ఈ ఆత్మకథను రాసేదానిని కాదు అని నీనా గుప్తా అన్నారు.

నాకు ఓ కుటుంబం ఉండాలని..

నాకు ఓ కుటుంబం ఉండాలని..

నాకు అందరి మాదిరిగానే భర్త, పిల్లలు, కుటుంబం ఉండాలని కోరుకొనేదానిని. ఇతరులు అత్త, మామ, భర్త, పిల్లలతో ఉంటే ఈర్ష్య కలిగేది. నాకు ఎందుకు ఇలాంటి జీవితం లేదని బాధపడేదానిని. కానీ విధి ఆడిన నాటకంలో నాకు అవి సాధ్యపడలేదు. తప్పు చేసిన ప్రతీసారి నేను దానిని అంగీకరించేదానిని, సరిదిద్దుకొనేందుకు ప్రయత్నించేదానిని. నా జీవితం ఒంటరిగానే గడిచింది. అందుకు ఎవరినీ నిందించను అని నీనా గుప్తా తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput Biopic Motion Poster Viral సూసైడ్ or మర్డర్?
నా తల్లిదండ్రులు బతికి ఉంటే..

నా తల్లిదండ్రులు బతికి ఉంటే..

సచ్ కహా తో ఆత్మకథను నా తల్లిదండ్రులు బతికి ఉంటే రాసేదానిని కాదు. కొన్ని విషయాలు వాళ్లకు తెలిస్తే వారి జీవితపు చివరి దశలో బాధ పడటానికి అవకాశం ఉండేది. అందుకే ఇప్పుడు ఆత్మకథను రాశాను అని నీనా గుప్తా తెలిపారు. నీనా వ్యక్తిగత విషయానికి వస్తే.. వివియన్ రిచర్డ్స్‌తో బ్రేకప్ తర్వాత చాలా సంవత్సరాలు ఒంటరిగానే బతికింది. ఇటీవల వివేక్ మెహ్రా అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడింది. ప్రస్తుతం ముక్తేశ్వర్‌లో ఉంటున్నారు. కోవిడ్ కారణంగా ముంబై రాలేక వర్చువల్ మీటింగ్ ద్వారా ఆత్మకథను ఆవిష్కరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X