»   » తట్టుకోలేక పోతున్న సమంత (ఫోటో)

తట్టుకోలేక పోతున్న సమంత (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అబ్బా ఈ చలేంట్రా బాబూ.....తెగ వణికించేస్తోంది అంటూ దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగులో భాగంగా జపాన్‌లో ఉన్న సమంత కూడా చలికి తట్టుకోలేక ఇలా నిల్చొనే నిండా ముసుగేసింది. ఇక్కడున్న ఫోటోను చూస్తే స్పష్టమవుతోంది ఈ అందాల సుందరిని చలి ఎంతగా ఇబ్బంది పెడుతోందో...!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత హీరో హీరోయిన్లుగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టోక్యో లో ఈ సినిమా ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా చిత్రీకరణ ముగియడంతో హైదరాబాద్ బయల్దేరినట్లు సమంత తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొంది.

సమంత సినిమాల విషయానికొస్తే....ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్టయింది. మరో వైపు జూ ఎన్టీఆర్‌కు జోడీగా సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.

నాగ చైతన్యకు జోడీగా 'ఆటో నగర్ సూర్య' సినిమాతో పాటు అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం 'మనం'లో నటిస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్‌కు జోడీగా 'రభస' చిత్రంలో కూడా చేస్తోంది. అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యే సినిమాకు కూడా కమిట్ అయింది. దీంతో పాటు ఓ హిందీ, మరో తమిళ సినిమాకు సైన్ చేసింది.

English summary
"Our brave brave Samanthaprabhu2 ... In the cold cold wind!! Proud of u sammy!" tweeted Neeraja Kona.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu