twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీరాజనం పాటలు వచ్చేసాయ్.... ఓసారి వినెయ్యండి

    |

    మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం. అవన్ ఆళ్ల దర్శకుడు. మహాలక్ష్మీ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఈ చిత్రాన్ని దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్ విడుదల చేయగా రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించించారు.

    Neerajanam Telugu Movie Audio Launch

    ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ నీరాజనం మంచి టైటిల్. మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో నిర్మించిన ఈ సినిమా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తిరిగిరావాలి. రవిశంకర్ అందించిన పాటలు అద్భుతంగా వున్నాయి. సభ్యసాచి ఓరియాలో స్టార్ హీరో, షాపింగ్‌మాల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మగేష్..ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. దర్శకుడు అవన్ ఆళ్ల మాట్లాడుతూ ఓ మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రమిది.

    Neerajanam Telugu Movie Audio Launch

    మూడేళ్ల క్రితం చేసుకున్న కథ ఇది. ఏడాది క్రితం నిర్మాతకు చెప్పాను. నాపై నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగుతుంది అన్నారు. నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ దర్శకుడిపై వున్న నమ్మకంతో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. చాలా కథలు విన్నాను.

    Neerajanam Telugu Movie Audio Launch

    అయితే అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడైతే బాగుంటుందని అవన్ ఆళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని, బన్నీ ప్రకాష్, కెమెరామెన్ మహీశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Telugu Movie Neerajanam Audio Launch yesterday at Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X