'గోదావరి' పిల్లకీ తప్పలా...

'సమ్మర్ 2007' పేరుతో రెడీ అవుతున్న సినిమాలో ఆమె తడి..తడి అందాలను ఆ సాంగ్ లో చూపి కనువిందుచేస్తుందిట. దాంతో హీరోయిన్ టు ఐటమ్ బాంబ్ లిస్ట్ లో నీతూ చంద్ర కొత్తగా కలిసినట్లయింది. బాలీవుడ్ లో ఈ మధ్య పేరున్న హీరోయిన్ లు ఐష్, కత్రినా, బిపాషా, ప్రియాంకాచోప్రా,ఈషాడయోల్ ...తమ అందచందాలను తెరపై స్పెషల్ గా ఒక పాటలో చూపటానికి ఇష్టపడి కొత్త ట్రెండ్ కి తెరలేపారు. ఇప్పుడా ట్రెండు టాలీవుడ్ కీ పాకింది. ఇక ఆ ట్రెండుని అందిపుచ్చుకోవటానికి మిగతా హీరోయిన్లు కీ తప్పేటట్లలేదు.
నిజానికి ఆసక్తి లేక పోయినా నీతూ నేను సైతం అనాల్సివచ్చింది. నీతూ చంద్ర కూడా ఈ వరసలో చేరటం బాలీవుడ్ లో అందరికీ చర్చనీయాంసంగా మారింది. అయినా 'సమ్మర్ 2007' సినిమాని శీతాకాలంలో రిలీజు చేసి సమ్మర్ ఎఫెక్టు నీతూ తో సృష్టిస్తారేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











