'నేనింతే' లో నీతూ చంద్ర?

నిజానికి నీతూచంద్ర తక్కువదేమీ కాదు. కాలం కలసి రాలేదంతే. ఆమె మంచి కథక్ డాన్సర్ . అంతేగాక మార్షిల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాథించిన సాహసి. తెరంగ్రేటం కూడా బాలీవుడ్ లో మథుభండార్కర్ 'ట్రాఫిక్ సిగ్నల్' తో జరిగింది.తరువాత 123,గరంమసాళా చిత్రాలలో చేసింది. కాని ఎందుకో రావల్సినంత పేరు, అవకాశాలు రాలేదు. తెలుగులో 'విష్ణు,గోదావరి' సినిమాలు చేసింది. కాని ఇక్కడా హిస్టరీ రిపీటయ్యింది. ఎవరూ పట్టించుకోలేదు. అలా కెరీర్ కదలకపోవడంతో కలత చెందిన నీతూ పూరీ సినిమా వచ్చిందంటే షాకయిపోయిందిట.ప్రెండ్సందరికీ పేరు పేరునా పలకరించి పార్టీ చేసినంత హడావిడి చేసిందిట.ఎందుకంటే పూరీ సినిమాలో నటిస్తే ఇలియానాలా వెలిగిపోవచ్చు,హన్సికా లా డిమాండున్న హీరోయిన్ కావచ్చు.అంతేకాక సెవన్ సీస్ టెక్నాలిజీస్ వారు రూపొందిస్తున్న నీతు-ది ఎలియన్ కిల్లర్ అనే 3డి మొబైల్ గేమ్ అనే కొత్త ఫార్మెట్ ఆమెతోనే ఫ్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











