నీతూచంద్ర 'ఆదిభగవాన్' తెలుగులో...

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ' కథ డిమాండ్ మేరకు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. రూ 36 కోట్ల వ్యయంతో రెండేళ్ల పాటు థాయ్‌లాండ్, టోరంటో, అమెరికా, రాజస్థాన్, ముంబాయి, గోవా ప్రాంతాల్లో చిత్రం రూపుదిద్దుకుంది. ఇది ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీ. ఆ పాత్రను 'జయం'రవి అద్భుతంగా పోషించారు.
ఇక హీరోయిన్ గా గోదావరి ఫేమ్ నీతూచంద్ర నటించారు. యువన్‌శంకర్‌రాజా అందించిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆడియో పెద్ద హిట్ అయింది. అలాగే తెలుగు శ్రోతలను కూడా ఈ పాటలు ఆకట్టుకుంటాయని నా నమ్మకం. మరో విషయం ఏమిటంటే ఆరో-3డి ఆడియో టెక్నాలజీతో ఆసియాలోనే రూపుదిద్దుకున్న రెండో సినిమా ఇది.
'జయం'రవి, నీతూచంద్ర, సుధాచంద్రన్, బాబ్ ఆంటోని, కరుణ, మోహన్‌రాజ్, రవిశంకర్, టార్జాన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో సాక్షి శివానంద్ ప్రత్యేకపాత్ర పోషించింది. 'ఆదిభగవాన్' చిత్రానికి మాటలు, పాటలు: శివగణేశ్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఆర్.బి.గురుదేవ్, కె.దేవరాజ్, ఎడిటింగ్: రాం సుదర్శన్, నిర్మాత: అన్బుళగన్, దర్శకత్వం: అమీర్‌సుల్తాన్.


Click it and Unblock the Notifications











