twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీతూచంద్ర 'ఆదిభగవాన్' తెలుగులో...

    By Srikanya
    |

    Neethu Chandra's Aadi Bhagavan film in telugu
    హైదరాబాద్ : 'జయం'రవి, నీతూచంద్ర జంటగా అమీర్‌సుల్తాన్ దర్శకత్వంలో డిఎంకె నాయకుడు అన్బుళగన్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదిభగవాన్'. తమిళంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్బుళగన్ స్వయంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెల్లోనే సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ' కథ డిమాండ్ మేరకు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. రూ 36 కోట్ల వ్యయంతో రెండేళ్ల పాటు థాయ్‌లాండ్, టోరంటో, అమెరికా, రాజస్థాన్, ముంబాయి, గోవా ప్రాంతాల్లో చిత్రం రూపుదిద్దుకుంది. ఇది ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీ. ఆ పాత్రను 'జయం'రవి అద్భుతంగా పోషించారు.

    ఇక హీరోయిన్ గా గోదావరి ఫేమ్ నీతూచంద్ర నటించారు. యువన్‌శంకర్‌రాజా అందించిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆడియో పెద్ద హిట్ అయింది. అలాగే తెలుగు శ్రోతలను కూడా ఈ పాటలు ఆకట్టుకుంటాయని నా నమ్మకం. మరో విషయం ఏమిటంటే ఆరో-3డి ఆడియో టెక్నాలజీతో ఆసియాలోనే రూపుదిద్దుకున్న రెండో సినిమా ఇది.

    'జయం'రవి, నీతూచంద్ర, సుధాచంద్రన్, బాబ్ ఆంటోని, కరుణ, మోహన్‌రాజ్, రవిశంకర్, టార్జాన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో సాక్షి శివానంద్ ప్రత్యేకపాత్ర పోషించింది. 'ఆదిభగవాన్' చిత్రానికి మాటలు, పాటలు: శివగణేశ్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఆర్.బి.గురుదేవ్, కె.దేవరాజ్, ఎడిటింగ్: రాం సుదర్శన్, నిర్మాత: అన్బుళగన్, దర్శకత్వం: అమీర్‌సుల్తాన్.

    English summary
    For about two years in the making, Ameerin Aadhi Bhagavan have got itself circled with tremendous expectations as it marks Ameer's return to direction after six years. Present Aadhi Bhagavan is dubbing in telugu. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X