ఫైనల్ గా నీతూ చంద్రకి క్షమాపణ చెప్పిన వెబ్ సైట్
మొత్తానికి నీతు చంద్రకు వెబ్ సైట్ వారు క్షమాపణ చెప్పటంతో గొడవ ముగిసింది. రీసెంట్ గా నీతు చంద్ర 'ఆది భగవాన్" అనే తమిళ చిత్రం కోసం హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ ని అడ్డం పెట్టుకుని ఓ వెబ్ సైట్ నీతూ ప్యాంటీ లేకుండా ఓ ఫంక్షన్లో కనిపించిందని...ఆమె కూడా యానాగుప్తా బాటలో నడుస్తోందని రాసింది. దాంతో మండిపడ్డ నీతు 'నేనేమీ యానాగుప్తాను కాను...ఉచితంగా ప్రచారం చేయించుకోవడానికి" అంటూ కోపంగా ఆ వెబ్ సైట్ నిర్వాహకులపై నేషనల్ కమిషన్ ఆఫ్ వుమెన్ (ఎన్ సిడబ్ల్యు)కు ఫిర్యాదు కూడా చేసింది. దాంతో ఆ వెబ్ సైట్ వారు నీతూకు సారీ చెప్పడంతో కథ సుఖాంతమయింది. ఈ సందర్భంగా నీతూ పర్సనల్ వ్యవహారాలు చూసే అసిస్టెంట్ మాట్లాడుతూ 'అలాంటి చీప్ పబ్లిసిటీ తమ మేడమ్ కు అవసరం లేదు" అని వ్యాఖ్యానించాడు.
నీతూ చంద్ర యానా గుప్తా సుమంత్ గోదావరి 13బి మాధవన్ neetu chandra yana gupta sumanth godavari 13b madhavan


Click it and Unblock the Notifications