సత్యమేవ జయితే చిత్రంపై వివాదాల్లో కూరుకుని పాపులర్ అయిన నీతూ చంద్ర ఈ మధ్య హఠాత్తుగా లావెక్కింది. దాంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. అందులోనూ ఆమె మాధవన్ తో కలసి నటించిన 13 బి చిత్రం రిలీజ్ అవటంతో ప్రమేషన్ కి మీడియా మీట్ లకు అటెండ్ కావాల్సి వచ్చింది. దాంతో నీతూని నిశితంగా గమనిస్తున్న వారు ఆ ప్రశ్నే వేసారు. తడబడిన నీతూ వెంటనే ఓ కారణం చెప్పింది. గోవాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు యాక్సెడెంట్ అయ్యిందని, అప్పుడు రెస్ట్ తీసుకోవటంతో బరువు ఎక్కాను అంది. ఇంతకీ యాక్సెడెంట్ ఎలా జరిగిందే ఆమె చెప్పలేదు. అంతే గాక నీతూ లాంటి సెలబ్రేటికి యాక్సిడెంట్ అయితే మీడియా వెంటనే ఎలర్టు అవుతుంది కదా..అలాంటిదేం వినపడలేదు కదా అని అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.