నీతూచంద్రకు బెదిరింపు
గోదావరి, సత్యమేవ జయితే చిత్రంలో నటించిన నీతూచంద్ర తాజాగా ఓ తలనొప్పిని ఎదుర్కొంటోంది. ఇంటిపనులు చూసేందకు, ఇంటిని కనిపెట్టుకుని ఉండేందుకు ఆమె పది నెలల క్రితం తన ఆషమా అనే నేపాలీ అమ్మాయిని పనిలో పెట్టుకుంది. అయితే ఇటీవల కాలంలో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక్కొక్కటే మాయం అవుతుండటంతో ఆషమాను నీతూ నిలదీసిందంట. వాటి గురించే తనకు తెలియదంటూ ఆమె సమాధానం చెప్పిందట. అయితే అప్పట్నించీ నీతూకు సమస్యలు మొదలయ్యాయట.
నీతూ ఔట్ డోర్ షూటింగ్ ల కోసం వెళ్లినప్పుడుల్లా ఆషమా భర్త కూడా ఆ ఇంట్లోనే మకాం పెట్టడం మొదలెట్టాడు. దాంతో నీతూకు కోపం వచ్చి కేకలేసింది. అలాగే ఆమెను పనిలోంచి పొమ్మంది.అయితే అక్కడే నీతూకు ట్విస్ట్ పడింది. అలా తీసేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటాననీ, అందుకు నీతూనే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఛస్తానని బెదిరించింది. దాంతో మైండ్ బ్లాక్ అయిన నీతూ తన శ్రేయాభిలాషులు వద్ద మొరపెట్టుకుందిట. ఈ రివర్స్ గేర్ వ్యవహారం ఎలా వదిలించుకోవాలా అని ప్లా్ చేస్తోంది. కొందరైతే పోలీసులకు కంప్లైంయింట్ ఇచ్చి పరిష్కరించుకోమన్నారుట. అయితే దానికి నీతూ సముఖుంగా లేదట. ఎందుకు..ఎక్కడ లొసుగనేది తెలియటం లేదని బాలీవుడ్ లో గుసగుసలుపోతున్నారు.


Click it and Unblock the Notifications











