»   » సినిమా కోసం ఇంత కష్టమా..!? గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం పరిశోధనే జరుతుంది...

సినిమా కోసం ఇంత కష్టమా..!? గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం పరిశోధనే జరుతుంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పీరియాడికల్ మూవీ అంటే సాధారణం గానే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుంది. చారిత్రక పాత్రలని, ఆనాటి సామాజిక జీవన విధానాన్నీ తెలుసుకోవాలన్న ఆసకి అది. అయితే ఆ సబ్జెక్ట్ ని టచ్ చేయతం..., దాన్ని విజువల్ గా కన్వే చేయతం మామూలు విశయం కాదు. కథని ఎక్కువగా మార్చలేరు... బాగా పేరున్న వ్యక్తినే ప్రధాన పాత్రగా తీసుకుంటే ఈ పాటికే ఆకథ జనం లో తెలిసి పోయే ఉంటుంది కాబట్టి ఇతర అంసాలతోనే మరింత రక్తి కట్టించాలి... ఆ సబ్జెక్ట్ మీద లోతైన పరిశోధన జరగాలి...

ఇంక ప్రేక్షకుడిని ఆకర్శించే ఇంకో విశయం మేకింగ్ విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.


Neetu Lulla Research for Gautamiputra Satakarni Designs

బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం నీతూలుల్లా, దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు.


చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతూ లుల్లా తెలియజేశారు.చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

English summary
India’s best costume designer and three times National Awards winner Neetu Lulla is designing costumes for the magnum opus Gautamiputra Satakarni. Her noticeable works include Devdas and Jodha Akbar.Neetu Lulla is working closely and dedicatedly with director Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu