'నీవెవరో' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన కొరటాల శివ!
బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా నీవెవరో చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ లాంచ్ అయింది. ఆది పినిశెట్టి, తాప్సి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. బాక్సింగ్ భామ రితిక సింగ్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. మోషన్ పోస్టర్ లో ఆది పినిశెట్టి, తాప్సి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన కొరటాల శివకు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మోషన్ పోస్టర్ లో అచ్చు అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం ఆసక్తిని పెంచుతోంది. చిత్ర విడుదల తేదీ, ఇతర విశేషాలు త్వరలో ప్రకటించనున్నారు. ఎంవివి సినిమా బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.
koratala siva kona venkat aadhi pinisetty taapsee ritika singh కొరటాల శివ కోన వెంకట్ ఆది పినిశెట్టి తాప్సి


Click it and Unblock the Notifications